బీజేపీ విస్తరణ, టీడీపీతో కలిసి పనిచేస్తాం: అమిత్ షా
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందంటే తెలుగుదేశానికి తాము వ్యతిరేకం కాదని, మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసి పనిచేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. తమ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారందరిని ఆహ్వానిస్తామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 45 లక్షల సభ్యత్వం తమ లక్ష్యమని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మోడీ, అమిత్ షా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాలు సాధించిందని అన్నారు.
త్వరలో ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో 70కు పైగా సీట్లు సాధించడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రస్తుతం తూర్పు, దక్షణాది రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ మంత్రి మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, పలువురు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications