వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న‌సేన చివ‌ర్లో హ్యాండివ్వొచ్చు: బీజేపీ హైక‌మాండ్ సందేహం?

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన త‌మ‌కు చివ‌రి నిముషంలోనైనా హ్యాండివ్వొచ్చ‌నే సందేహంలో ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌కుండా ఉండాల‌న్న ఉద్దేశంతో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీతో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్నార‌ని, ఏపీలో క‌రోనావ‌ల్ల భౌతిక దూరం పెరిగిందంటున్నారుకాబ‌ట్టి త‌మ‌కు పొత్తు కొన‌సాగుతుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని ఏపీ బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

 2024 త‌ర్వాతా బీజేపీకే జ‌గ‌న్ మ‌ద్ద‌తు?

2024 త‌ర్వాతా బీజేపీకే జ‌గ‌న్ మ‌ద్ద‌తు?


కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్య‌తిరేకంగా ఉన్న జ‌గ‌న్ 2024 ఎన్నిక‌ల త‌ర్వాత కూడా త‌మ‌కే మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంద‌ని, జ‌న‌సేన వెళ్లిపోయినా ఇబ్బంది లేద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఏపీకి పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వ‌చ్చిన‌ప్ప‌టికీ జ‌న‌సేనానికి ఆహ్వానం పంప‌లేదు. మ‌రోవైపు ఆ పార్టీ నాయ‌కులు మాత్రం పొత్తు ఉంటుంద‌ని, క‌లిసే వెళ‌తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, ఇక్క‌డివారితో మాత్రం లేవ‌ని ప‌రోక్షంగా చెబుతున్నారు.

వైసీపీపై ఆధార‌ప‌డ‌ట‌మే ఉత్త‌మం?

వైసీపీపై ఆధార‌ప‌డ‌ట‌మే ఉత్త‌మం?


ఏపీలో ప్ర‌స్తుతానికి ఒక‌శాతం ఓటింగ్ కూడా క‌ష్ట‌మ‌వుతోంది కాబ‌ట్టి వైసీపీపై ఆధార‌ప‌డ‌ట‌మే ఉత్త‌మ‌మ‌నే యోచ‌న‌కు బీజేపీ పెద్దలు వ‌చ్చార‌ని చెబుతున్నారు. అందుక‌నే రాజ్య‌స‌భ‌కు కూడా ఏపీ నుంచి ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి ఢిల్లీ పెద్ద‌లు అంగీక‌రించ‌డంలేదు. జ‌న‌సేనాని మాత్రం క‌లిసి వెళితేనే వైసీపీని ఓడించ‌గ‌ల‌మంటున్నారు. క‌లిసి వెళ్లినా, వెళ్ల‌క‌పోయినా వైసీపీ ఎలాగూ స‌హ‌క‌రిస్తుంది.. పొత్తు లేకుండా పోటీచేసి తెలుగుదేశం గెలిస్తే త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం అనుమాన‌మేన‌టున్నారు.

తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్న జ‌న‌సేనాని

తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్న జ‌న‌సేనాని


జ‌న‌సేనాని మూడు ఆప్ష‌న్లు ఇచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న మ‌న‌సంతా తెలుగుదేశం పార్టీవైపే ఉంద‌ని, చివ‌రి నిముషంలోనైనా ఆయ‌న త‌మ‌కు హ్యాండిచ్చే అవ‌కాశాలున్నాయ‌ని బీజేపీ నేత‌లు అనుమానిస్తున్నారు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒత్తిడి మేర‌కు ఢిల్లీ పెద్ద‌లు అంగీక‌రిస్తే తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసివెళ్లే అవ‌కాశాలున్నాయంటున్నారు. అయితే అటువైపు నుంచి ఇంకా ఎటువంటి స్పంద‌నా రాలేదు. వారిని ఒప్పించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో క‌న‌ప‌డుతోంది. మ‌రి.. బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సి ఉంది.!!

English summary
Janasena may hand over at last: BJP high command in doubt?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X