బిజెపి నాయకుడు బంగారు లక్ష్మణ్ కన్నుమూత

కేంద్ర ప్రభుత్వంలో 1999 నుంచి 2000 వరకు రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రక్షణ కొనుగోళ్ల కుంభకోణంలో ఆయనకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని మాదిగ కుటుంబంలో పుట్టిన ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.
ఆయన బిఎ, ఎల్ఎల్‌బి హైదరాబాదులో పూర్తి చేశారు. ఆయన భార్య సుశీలా లక్ష్మణ్ 14వ లోకసభలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాజస్థాన్‌లోని జాలోర్ నియోజక వర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
చిన్న వయస్సులోనే ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలు జీవితం గడిపారు. బంగారు లక్ష్మణ్ 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. బంగారు లక్ష్మణ్ మృతికి బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications