వైజాగ్ లో నారా లోకేష్ ను కలుస్తా! BJP నేత సంచలనం
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వార్డు కార్పొరేటర్లతోపాటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. వారు ప్రధానంగా ప్రస్తావించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీచేస్తున్నారు.

కన్నా బీజేపీలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడను
జనసేనాని
పవన్
కల్యాణ్
కొండగట్టు
ఆంజనేయస్వామి
వద్ద
తన
వారాహి
వాహనానికి
పూజలు
చేయించారు.
ఏపీ
రవాణాశాఖ
నుంచి
అనుమతులు
వస్తే
ఆయన
యాత్ర
ప్రారంభించడమే
తరువాయి
అన్నట్లుగా
ఉంది.
ఈ
సమయంలో
ఆయన
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
బీజేపీతో
పొత్తులోనే
ఉన్నామన్నారు.
కానీ
భీమవరంలో
జరుగుతున్న
బీజేపీ
రాష్ట్ర
కార్యవర్గ
సమావేశాల్లో
మాత్రం
పార్టీ
అధ్యక్షుడు
సోము
వీర్రాజు
జనసేన
ఊసే
ఎత్తలేదు.
ఈ
రెండు
పార్టీల
మధ్య
అధికారికంగా
పొత్తున్నప్పటికీ
వారు
కలిసి
చేసిన
కార్యక్రమాలు
లేవు..
పోరాటాలు
లేవు.
కొండగట్టులో
పవన్
మాట్లాడుతూ
కొత్త
పొత్తులుంటాయన్నారు.
అలాగే
కన్నా
లక్ష్మీనారాయణ
బీజేపీలో
ఉన్నారని,
దానిపై
తానేమే
వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు.

పాదయాత్రలో పొత్తులపై స్పష్టత
తెలుగుదేశం
పార్టీ
అధినేత
చంద్రబాబునాయుడు
బాదుడే
బాదుడుతోపాటు
ఇదేం
ఖర్మ
పేరుతో
జిల్లాల
యాత్రలు
చేస్తున్నారు.
ఆయన
తనయుడు
నారా
లోకేష్
ఈనెల
27వ
తేదీ
నుంచి
పాదయాత్రకు
సిద్ధమవుతున్నారు.
400
రోజులపాటు
4వేల
కిలోమీటర్లకు
పైగా
ఈ
యాత్ర
జరగనుంది.
కుప్పంలోని
వరదరాజస్వామి
ఆలయంలో
పూజలు
నిర్వహించి
ప్రారంభమయ్యే
యాత్ర
శ్రీకాకుళం
జిల్లా
ఇచ్ఛాపురంలో
ముగియనుంది.
ఈ
పాదయాత్ర
జరిగే
సమయంలోనే
రాష్ట్రంలోని
రాజకీయ
పార్టీల
పొత్తులపై
ఒక
స్పష్టత
రానుందని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.

పవన్ అభిప్రాయమే నా అభిప్రాయమన్న విష్ణుకుమార్ రాజు
పాదయాత్ర
సమయంలోనే
పొత్తులపై
స్పష్టత
వస్తే
నియోజకవర్గాల్లో
అభ్యర్థుల
ఎంపిక
కూడా
సులువవుతుందని
భావిస్తున్నారు.
టీడీపీ-జనసేన
పొత్తు
పెట్టుకోవడం
ఖాయమైనప్పటికీ
బీజేపీతో
పొత్తుంటుందా?
లేదా?
అనేది
తేలలేదు.
అయితే
రాష్ట్ర
బీజేపీలో
ఒకవర్గం
టీడీపీతో
పొత్తుండాలని
పట్టుబడుతుండగా,
మరోవర్గం
వద్దని
పట్టుబడుతోంది.
కార్యవర్గ
సమావేశాల్లో
సోము
వీర్రాజు
పొత్తుల
గురించి
మాట్లాడలేదు.
పొత్తులపై
కేంద్ర
నాయకత్వం
నిర్ణయం
తీసుకుంటుందని
బీజేపీ
రాష్ట్ర
ఉపాధ్యక్షుడు
విష్ణుకుమార్
రాజు
తెలిపారు.
రాబోయే
ఎన్నికలకు
సంబంధించిన
కార్యవర్గ
సమావేశాల్లో
కార్యాచరణ
రూపొందిస్తామన్నారు.
వైసీపీ
దుర్మార్గాలను
తిప్పికొట్టాలని
పిలుపునిచ్చారు.
యువగళం
పాదయాత్రలో
భాగంగా
నారా
లోకేష్
ను
తాను
విశాఖపట్నంలో
కలుస్తానని
ప్రకటించారు.
ప్రభుత్వ
వ్యతిరేక
ఓటు
చీలనివ్వనన్న
పవన్
కల్యాణ్
అభిప్రాయమే
తన
అభిప్రాయమన్నారు.