వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వెనక గోతులు తవ్వుతున్నది వారేనా?

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో జనసేనతో మిత్రపక్షంగా ఉన్నామని భారతీయ జనతాపార్టీ నాయకులు చెబుతుంటారు. కానీ జనసేన నాయకులు మాత్రం కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందంటారు. చంద్రబాబుతో మీడియా సమావేశం జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని బీజేపీ ప్రతిరోజు ప్రకటిస్తోంది. ఇటీవలే విశాఖపట్నం వచ్చిన ప్రధానమంత్రి మోడీ పవన్ తో అరగంట భేటీ జరిపారు. ప్రధానమంత్రి మీద గౌరవంతో ఆయన చెప్పిన విషయాలను తాము బయటకు వెల్లడించమని పవన్, నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

బీఆర్ఎస్ లో చేరిన కాపువర్గ నేతలు

బీఆర్ఎస్ లో చేరిన కాపువర్గ నేతలు


తాజాగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు పలువురు భారత రాష్ట్ర సమితిలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. వారిని ఆ పార్టీలో చేర్చించిందెవరు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నవారిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వియ్యంకుడు ఉన్నారని, ఆయన ఆ పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీతో జనసేన కలిసి వెళ్లడం దాదాపు ఖాయమే

టీడీపీతో జనసేన కలిసి వెళ్లడం దాదాపు ఖాయమే


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకొని వెళ్లడం దాదాపు ఖాయమైంది కాబట్టి జనసేన పార్టీని వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసే ప్రణాళికను అమలు చేస్తున్నరనేది కన్నా ప్రధాన ఆరోపణ. సోము వీర్రాజే ఆ నేతల్ని బీఆర్ఎస్ లోకి వెళ్లేలా ఉసి గొల్పారనేది కన్నాతోపాటు మరికొందరు సీనియర్ బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే ఆ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లారని కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ ను, తెలంగాణలో బండి సంజయ్ ను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసే ప్రణాళిక అమలు చేస్తున్నరాని కన్నా మండిపడుతున్నారు.

 పార్టీ నేతలపై కన్నా తీవ్ర అసంతృప్తి

పార్టీ నేతలపై కన్నా తీవ్ర అసంతృప్తి


కన్నా అభిప్రాయం ప్రకారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆలోచనలు స్థానిక బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు భిన్నంగా ఉంటాయి. అమరావతితోపాటు అనేక అంశాల్లో ఈ విషయం స్పష్టంగా నిరూపితమైందంటారు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా నియమితులైనవారిని సోము వీర్రాజు తొలగిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించినవారిని తొలగించడమేంటని కన్నా మండిపడుతున్నారు. అధ్యక్షులను తొలగించాలంటే కోర్ కమిటీలో చర్చించాలని, అటువంటిదేమీ లేకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. కన్నా గతంలో కూడా సోము వీర్రాజుతోపాటు కొందరు ఏపీ బీజేపీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి పెద్దలు ఫోన్ చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించడంతో కన్నా సైలెంటయ్యారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుతో వెళ్లడం ఖాయం కాబట్టి జనసేనలో చేరి గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేసి విజయం సాధించాలనేది కన్నా ఆలోచనగా ఉంది.

English summary
Is the BJP strategically weakening Pawan Kalyan?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X