టిడిపిని వద్దంటారా!?: వీడియోలు చూసి సొంత నేతలకు బిజెపి షాక్
బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన సొంత పార్టీ నేతలపై బిజెపి అధిష్టానం గుర్రుగా ఉంది.
అమరావతి: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన సొంత పార్టీ నేతలపై బిజెపి అధిష్టానం గుర్రుగా ఉంది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.
అమిత్ షా విజయవాడ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై పార్టీ పెద్దలు ఆగ్రహం ఉన్నారు. ఇప్పటికే వారికి క్లాస్ పీకారని తెలుస్తోంది.

ప్రదర్శించిన వారు, ప్రోత్సహించిన నేతల వివరాలు సేకరణ
బిజెపి - టిడిపి పొత్తుపై పలువురు ప్లకార్డులను ప్రదర్శించడాన్ని అధిష్ఠానం చాలా తీవ్రంగా పరిగణించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారు, ప్రోత్సహించిన నేతల వివరాలను సేకరించింది.

వీడియోను పరిశీలించి
ఈ అంశానికి సంబంధించిన ఆ రోజు అమిత్ షా సమావేశం మాట్లాడుతుండగా ఎవరు ప్లకార్డులు ప్రదర్శించారో తెలుసుకునేందుకు వీడియోలను అధిష్టానం పరిశీలించింది.

వీడియోల్లో ఎవరున్నారు.. వారి వెనుక ఎవరు
ఆ వీడియోల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎవరున్నారో గుర్తించిన అధిష్టానం.. వారి వెనుక ఎవరున్నారనే అంశంపై కూడా ఆరా తీసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బాద్యులపై చర్యలు తీసుకోనుందని సమాచారం.

టిడిపిని వద్దంటున్న నేతలపై ఆరా?
ఏపీ బిజెపిలో ఓ విధంగా రెండు వర్గాలు ఉన్నాయని చెప్పవచ్చు. టిడిపికి అనుకూలంగా, వ్యతిరేకంగా వర్గాలు ఉన్నాయి. పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా వారు విమర్శలు కూడా చేస్తున్నారు. టిడిపితో పొత్తు వద్దని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లకార్డులు ప్రదర్శించిన వారు వెనుక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ప్లకార్డుల్లో ఇలా..
కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దంటూ పలువురు అమిత్ షా సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. నో టిడిపి, సేవ్ బిజెపి అంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది.












Click it and Unblock the Notifications