వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఏమో గానీ .. బీజేపీ టార్గెట్ మాత్రం టీడీపీనే .. ఏపీలో టీడీపీని లేకుండా చేసే వ్యూహంలో బీజేపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP ని నామరూపం లేకుండా చేసే ప్రయత్నాల్లో BJP?? | Chandra Baubu Naidu | Modi |Ram Madhav

ఏపీలో టీడీపీ చావు దెబ్బ తింది. ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది . ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబు మీద అటు వైసీపీ , ఇటు బీజేపీ మూకుమ్మడి దాడికి సిద్ధమైంది. వైసీపీ మాట ఎలా వున్నా బీజేపీ మాత్రం చంద్రబాబును దెబ్బ కొట్టాలని , టీడీపీని కోలుకోకుండా చెయ్యాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో టీడీపీలోని కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష అంటుంది.

ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు .... వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ హెచ్చరిక ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు .... వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ హెచ్చరిక

టీడీపీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్లాన్ రెడీ

టీడీపీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్లాన్ రెడీ

ఏపీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. , టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఏడాదిలోపుగానే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాం మాధవ్ ఏపీ పై దృష్టి సారించారని సమాచారం. 2024ఎన్నికల వరకు టీడీపీని నామరూపాలు లేకుండా చెయ్యాలని ప్లాన్ చేస్తున నేపధ్యంలోనే బీజేపీ ఏపీపై దృష్టి సారించింది.

టీడీపీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన ఫలితమే ఓటమి అంటున్న బీజేపీ నేతలు

టీడీపీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన ఫలితమే ఓటమి అంటున్న బీజేపీ నేతలు

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు విజయం సాధించింది టీడీపీ . ఇక 2019 ఎన్నికలకు ఏడాది ముందే ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకొంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓంటరిగాపోటీ చేసి 23 స్థానాలకే పరిమితమైంది. వైసీపీకి 151 స్థానాలు దక్కాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో దెబ్బతినడానికి ప్రధానంగా టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం కూడ కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర సర్కార్ తో టీడీపీ అధినేత చంద్రబాబు పెంచుకున్న పంచాయితీనే టీడీపీ కొంప ముంచిందని బీజేపీ వర్గాల అభిప్రాయం .

కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టాలని చూసిన చంద్రబాబుకు చెక్ పెట్టే ప్లాన్ లో బీజేపీ

కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టాలని చూసిన చంద్రబాబుకు చెక్ పెట్టే ప్లాన్ లో బీజేపీ

ఇక కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయాడు. దేశంలో బీజేపీయేతర పక్షాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి బీజేపీపై పోరాటం చెయ్యాలనుకున్న చంద్రబాబు ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఏపీలో చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలనేది బీజేపీ వ్యూహం. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బీజేపీ లక్ష్యం నెరవేరింది.ఇదిలా ఉంటే ఏడాది లోపుగా టీడీపీకి చెందిన కీలక నేతలకు గాలం వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీడీపీలో కీలకంగా పేరొందిన నేతలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్టుగా సమాచారం.

టీడీపీ కీలక నేతలకు బీజేపీ గాలం .. ఆపరేషన్ ఆకర్ష అంటున్న బీజేపీ నేతలు

టీడీపీ కీలక నేతలకు బీజేపీ గాలం .. ఆపరేషన్ ఆకర్ష అంటున్న బీజేపీ నేతలు

ఏపీ రాష్ట్రంలో కీలకమైన టీడీపీ నేతల జాబితాను సిద్దం చేసుకొని బీజేపీ చర్చలను ప్రారంభించినట్టుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు.పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. ఈ ప్రచారాన్ని రామానాయుడు ఖండించారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ అగ్ర నేత రామ్ మాధవ్ ఏపీపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. రానున్న ఏడాదిలో పార్టీని బలోపేతం చేసే దిశగా రామ్ మాధవ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీతో పాటు బీజేపీ వ్యూహలను తట్టుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితులు చంద్రబాబుకు ఇబ్బందికరమే .

English summary
TDP defeated in AP. In an unexpected manner, it has suffered great losses. In the aftermath of the election results, BJP and YCP are ready to attack on TDP. The BJP is thinking of crushing Chandrababu and losing TDP. BJP, is in the power at the center, the key leaders of the TDP have been attracted to the operation akarsh .The campaign is undertaken as BJP has initiated discussions with the list of key TDP leaders in AP. BJP's top leader Ram Madhav has been working on AP for a long time and has played a key role in bringing the BJP to power in most of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X