• search

ఢిల్లీ సాక్షిగా జగన్‌కు షాక్! రెండ్రోజుల్లో బాబు కీలక నిర్ణయం: అక్కడ సోనియా, ఇక్కడ పవన్ కళ్యాణ్

By Srinivas G
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   Is Sonia Gandhi Pawan Kalyan duo mull for AP

   అమరావతి: కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీపై టీడీపీ ఎంపీల తీవ్ర విమర్శలు, విభజన హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు ప్రయత్నాలు చేయడం వంటివి జరుగుతున్నాయి.

   అంతేకాదు, గురువారం జరిగిన ఏపీ బందుకు పరోక్షంగా టీడీపీ మద్దతు పలికింది. మరోవైపు లోకసభలో టీడీపీ ఎంపీలు సోనియా గాంధీని కలిశారు. టీడీపీ ఎంపీల నిరసనలు చేస్తుండగా సోనియా న్యాయం చేయాలని చిన్నగా అనడం, శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు అనుకూలంగా ట్వీట్. పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

   ఓసారి అలా, మరోసారి ఇలా: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, మోడీపై విమర్శలు

   ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి

   ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి

   ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు వెల్‌లోకి వెళ్లగా ఆయనకు టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ జత కలిశారు. విభజన హామీల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ తెలియకుండానే ఒక్కటవుతున్నాయి.

   బీజేపీతో తాడోపేడో

   బీజేపీతో తాడోపేడో

   బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత టీడీపీ ఎంపీలు బీజేపీ మిత్రపక్షం అయినప్పటికీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందే అంటున్నారు. వారికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెబుతున్నారు. విభజన హామీలు నెరవేరలేదని, బడ్జెట్‌లో అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు లోబల బయట తీవ్రమైన నిరసనలు చేపట్టాలని పదేపదే సూచించారు.

   రెండ్రోజుల్లో కీలక నిర్ణయమని హింట్

   రెండ్రోజుల్లో కీలక నిర్ణయమని హింట్

   ప్రస్తుతం చంద్రబాబు దుబాయ్‌లో ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చడం లేదు.. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు.. వీటికి తోడు పార్లమెంటులో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల ప్రకటనలు టీడీపీకి, చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అందుకే వారు ప్రకటన చేసినా టీడీపీ ఎంపీలు బెట్టు వీడలేదు. శుక్రవారం కూడా బాబు ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు హింట్ ఇచ్చారని తెలుస్తోంది.

   ఢిల్లీ సాక్షిగా జగన్ కార్నర్

   ఢిల్లీ సాక్షిగా జగన్ కార్నర్

   బడ్జెట్ అనంతరం ఈ ఐదు రోజులు జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏపీ ప్రజల్లో క్రెడిట్ కోసం ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. ఇందులో టీడీపీ ఎంపీలే ఎక్కువగా హైలెట్ అయ్యారు. దీంతో ఢిల్లీ సాక్షిగా జగన్‌ను, వైసీపీని టీడీపీ కార్నర్ చేసినట్లయిందని అంటున్నారు. గురువారం సజనా చౌదరి విభజన హామీలపై మాట్లాడినందుకు విజయసాయి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సూచన మాత్రమే చేశారని రాజ్యసభ చైర్మన్ తెలిపారు.

   టీడీపీ, వైసీపీలు ఇన్నాళ్లేం చేశాయని..

   టీడీపీ, వైసీపీలు ఇన్నాళ్లేం చేశాయని..

   ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామన్న వైసీపీ చేయలేదు. మిత్రపక్షంగా ఉండి టీడీపీ ఇప్పటి వరకు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. ఇదే విషయాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా, ఎన్నికలకు ముందు ఇదంతా డ్రామా కొత్తపల్లి గీత వంటి వారు ఆరోపిస్తున్నారు.

   అనూహ్య పరిణామాలు

   అనూహ్య పరిణామాలు

   ఈ ఐదు రోజుల్లో పార్లమెంటులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాడోపేడో తేల్చుకుంటామని టీడీపీ, అవసరమైతే అందుకు సిద్ధమని, లెక్కలు తీస్తామని బీజేపీ చెబుతున్నాయి. మరోవైపు, అనూహ్యంగా ఎంపీల నిరసనలకు సోనియా, రాహుల్‌ల మద్దతు, నిరసనలో టీడీపీ పరోక్షంగా పాల్గొనడం.. వంటివి చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి సమయంలో రెండ్రోజుల్లో చంద్రబాబు బీజేపీ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. అయితే బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన వేచి చూసే అవకాశాలు లేకపోలేదు.

   దేనికైనా సిద్ధమని టీడీపీ

   దేనికైనా సిద్ధమని టీడీపీ

   కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని టీడీపీ చెబుతోంది. అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ఎంపీలు అంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ శుక్రవారం కూడా చెప్పారు. తమను కేంద్రం పట్టించుకోవడం లేదని, స్నేహధర్మాన్ని పాటించడం లేదన్నారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఏపీలో పవన్ జేఏసీ ఏర్పాటు చేసి దిశలో ఉండగా, మోడీని 2019లో ధీటుగా ఎదుర్కోవడానికి సోనియా ఢిల్లీలో పార్టీల మద్దతు కోరుతున్నారు.

   English summary
   Andhara CM and Telugu Desam chief Chandrababu Naidu expressed dissatisfaction towards the centre and has said that a crucial decision will be taken in a couple days. He was talking with the party MPs on a conference call. He is currently in Dubai.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more