పవన్ కు NDA బిగ్ ఆఫర్, నాటి త్యాగానికి ఫలితం..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. కూటమి కొనసాగుతుందని.. కలిసే ఉంటుందని తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నేతల భేటీలో తేల్చి చెప్పారు. అటు పవన్ సైతం రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు టీడీపీ - జనసేన దక్కించుకున్నాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలు బీజేపీ - టీడీపీ నుంచి జనసేనకు వచ్చిన హామీ ఆసక్తి కరంగా మారింది. ఈ విషయంలో పవన్ తదుపరి నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

ఏపీలో రాజ్యసభ అభ్యర్దులు ఖరారయ్యారు. నాలుగు రాజ్యసభ స్థానాలను టీడీపీ మూడు.. ఒకటి జనసేన తీసుకున్నాయి. బీజేపీకి ఈ సారి అవకాశం దక్కలేదు. గతంలో రెండు సీట్లు బీజేపీకి ఇవ్వటంతో.. ఈ సారి సర్దుబాటు చేయలేమని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. టీడీపీలోనే రాజ్యసభ సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. జనసేన నుంచి తొలి సారిగా రాజ్యసభలో అడుగు పెడుతోంది. జనసేన నుంచి లింగమనేని రమేష్ రాజ్యసభ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. టీడీపీ నుంచి బాష్యం రామక్రిష్ణ, చింతకాయల విజయ్ కు అవకాశం దక్కిగా.. సానా సతీష్ ను మరోసారి ఎంపిక చేసారు. ఈ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, ఇదే సమయంలో జనసేన తమకు కూటమి నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో దక్కిన హామీ కార్యకర్తలకు వివరించింది.

యూత్ ను ఊపేస్తున్న అన్నామలై ఉద్యమం - విజయ్ కు కొత్త టెన్షన్..!!
యూత్ ను ఊపేస్తున్న అన్నామలై ఉద్యమం - విజయ్ కు కొత్త టెన్షన్..!!
bjp-tdp-big-offer-for-deputy-cm-pawan-kalyan-during-rajyasabha-elections-becomes-crucial-in-ap-poli

జనసేనకు మరో రెండు రాజ్యసభ స్థానాలు

2024 ఎన్నికల సమయంలో జనసేన రెండు ఎంపీ స్థానాలకు పోటీ చేసింది. వాస్తవంగా నాలుగు స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అందులో అనకాపల్లి నుంచి నాగబాబును బరిలోకి దించాలని ఆలోచన చేసారు. బీజేపీ ఆ సీటు కోరటంతో పవన్ ఎంపీ సీటును త్యాగం చేసారు. అదే విధంగా అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పులు జరిగాయి. దీంతో.. ఆ సమయంలో 2024 - 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించి.. ఒప్పందం జరిగిన ట్లుగా జనసేన తాజాగా వెల్లడించింది. ఈమేరకు ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంద ని పేర్కొంది. అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారని.. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కిందని వెల్లడించింది. అయితే, 2028 లో మరో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. 2029 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఒకే విడతలో రెండు స్థానాలు జనసేనకు దక్కుతాయా.. ఈ మధ్యలో ఏమైనా అవకాశం దక్కుతుందా అనేది చూడాల్సి ఉంది. దీంతో, 2029 ఎన్నికల్లోగానే రాజ్యసభలో జనసేన బలం పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+