అంతలోనే 'హోదా' సీన్ మారింది: మోడీ-జగన్‌లపై బాబు వ్యూహమేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం పైన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? ఇటు విపక్షాలకు చిక్కకుండా, అటు ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ ప్రకటన, వైయస్సార్ కాంగ్రెస్ - కాంగ్రెస్ పార్టీల బంద్ ఓ విధంగా చంద్రబాబును ఇరుకున పెట్టిందనే చెప్పవచ్చు. అయితే, దానిని ఆసరాగా చేసుకున్న చంద్రబాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.

ఏపీకి ఎలాగూ ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు తెలుసునని అంటున్నారు. దానికి బదులు ఏపీకి పెద్ద ఎత్తున నిధుల పైన ఆయన కన్నేశారని అంటున్నారు. ఏపీకి హోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసునని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకటికి రెండుసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

BJP-TDP relations under strain over special status for Andhra Pradesh

బీజేపీ నేతల మాటలు చూస్తుంటే కూడా ఏపీకి హోదా రాకపోవచ్చుననే అంటున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న టిడిపినే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.

ఓ వైపు కేంద్రాన్ని, ప్రధాని మోడీని ప్రశ్నించడం ద్వారా చంద్రబాబు.. తాము ఏపీ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నామని చెప్పినట్లు అయింది. అదే సమయంలో హోదా రాదని తెలుసు కాబట్టి, ప్రజలు, విపక్షాల ఆగ్రహాలు, ఆందోళనలను చూపించడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

గత శుక్రవారం జైట్లీ ప్రత్యేక హోదా పైన ప్రకటన చేసిన అనంతరం టిడిపి నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హోదా పైన ప్రధాని మోడీకి, బీజేపీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జైట్లీ ప్రకటన బాధించిందని, తాము రెండేళ్లు ఎదురు చూశామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జైట్లీ ఏదో చెప్పారుగా: వైసిపిపై సుమిత్ర ఫైర్, ఢిల్లీకి బాబు.. వ్యూహం సిద్ధం
అయితే, ఆ తర్వాత బీజేపీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో చంద్రబాబుతో మాట్లాడింది. అక్కడి నుంచి సీన్ మారిపోయిందని అంటున్నారు. ఎలాగు హోదా రాదు కాబట్టి ఏపీకి సాధ్యమైనన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉండవచ్చునని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు వ్యాఖ్యలతో టిడిపి-బిజెపి మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చుననే వాదనలు వినిపించినప్పటికీ, కలిసే ఉంటాయని తాజా పరిస్థితుల ద్వారా వెల్లడవుతోందని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP-TDP relations under strain over special status for Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి