మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!
ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాల దిశగా బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ స్థానంలో బీజేపీ తమ నేతను సీఎం చేసేందుకు సమాయత్తం అయింది. నితీశ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో పలువురి ని పార్టీ బాధ్యతల్లోకి తీసుకురానుంది. ఈ క్రమంలో ఏపీ నుంచి టీడీపీ - జనసేన కు కేంద్రంలో మరో మంత్రి పదవి ఖాయమైంది. ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి పైనా చర్చ జరుగుతోంది.
ఢిల్లీ - అమరావతి వేదికగా కీలక పరిణామాలకు రంగం సిద్దం అవుతోంది. కేంద్రంలో మంత్రివర్గం - బీజేపీ నాయకత్వం ప్రక్షాళన దిశగా మోదీ - షా కసరత్తు చేస్తున్నారు. బీహార్ నుంచి ప్రక్రియ ప్రారంభించారు. నితీశ్ ను కేంద్ర కేబినెట్ లోకి ... బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేతను ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న సీనియర్లను పార్టీ పదవుల్లోకి మార్చనున్నారు. పార్లమెంట్ సమావేశాల తరువాత కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఇందులో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు ప్రాధాన్యత దక్కనుంది. అదే సమయంలో ఏపీలో ఎన్డీఏ భాగ స్వాములుగా ఉన్న టీడీపీ- జనసేన నుంచి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించేలా నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండటంతో... కొత్త గా జనసేనకు అవకాశం ఇవ్వాలనే చర్చ ఢిల్లీలో జరుగుతోంది.

ఏపీ మంత్రివర్గంలో బీజేపీకి మరో బెర్తు
ప్రస్తుతం జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరికి అవకాశం ఇవ్వాలనేది పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి జనసేనకు దక్కనుంది. కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలనుకునే వారికి ఈ స్థానం ఇస్తారని తెలుస్తోంది. దీంతో.. పవన్ ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎంపీల్లోనే ఒకరిని ఎంచుకుంటారా.. ప్రచారం సాగుతున్నట్లుగా తన మనసులో ఉన్న నేత ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక.. ఏపీ మంత్రి వర్గంలో బీజేపీకి మరో మంత్రి పదవి ఖాయమైంది. ఈ మేరకు బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదన కు ఆమోదం వచ్చినట్లు సమాచారం. బీజేపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ను కేబినెట్ లోకి తీసుకోవటం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటామని హామీ ఇవ్వటంతో.. ఈ ఇద్దరి విషయంలో సామాజిక లెక్కలు కీలకంగా మారుతున్నాయి. దీంతో.. కేంద్ర కేబినెట్ లో టీడీపీ -జనసేన లో ఎవరికి అవకాశం వస్తుంది.. ఇక్కడ మంత్రివర్గం పైన తుది నిర్ణయం ఏంటనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications