రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: ఏపీ సర్కారుపై జేపీ నడ్డా విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ సర్కారు విచక్షణారహితంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని మండిపడ్డారు. ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందన్నారు.

ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది: జేపీ నడ్డా

ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది: జేపీ నడ్డా

ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోంది. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ హయాంలో మాతృభాషకు పెద్దపీట వేశామని..,రాష్ట్రంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యనించారు.

కేంద్రం నిధులతోనే ఏపీలో పథకాలు, అభివృద్ధి జేపీ నడ్డా

కేంద్రం నిధులతోనే ఏపీలో పథకాలు, అభివృద్ధి జేపీ నడ్డా

పలు సంక్షేమ పథకాలకు నిధులు తగ్గుతున్నాయని, కేంద్రం తరఫున రూ.77 వేల కోట్లు అందించామని జేపీ నడ్డా చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన కింద ఏపీకి 27 లక్షల ఇళ్లు, ఏపీ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, గిరిజన వర్సిటీ మంజూరు చేశామని వెల్లడించారు జేపీ నడ్డా. బీజేపీ హయాంలో సాగు బడ్జెట్‌ రూ.1.04 లక్షల కోట్లకు పెరిగిందని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేశామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రతిపక్షాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అనే నినాదానిచ్చారు జేపీ నడ్డా.

మోడీ వచ్చాకే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్: జేపీ నడ్డా

2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవి. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవి. గతంలో బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేది. కానీ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో సంస్కరణలు తెచ్చారు. మోడీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో 35 కోట్ల మందికి ముద్ర రుణాలు అందించామని జేపీ నడ్డా వెల్లడించారు. కరోనా వేళ 80 కోట్ల మందికి రేషన్‌ అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బీజేపీ హయాంలో పేదరికం 0.8 శాతం తగ్గిందని, దేశంలో ప్రాథమిక పాఠశాలలు 6.53 లక్షలకు చేరాయని వెల్లడించారు. భారత్‌లో 70 వేల స్టార్టప్‌లు సేవలందిస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 142 నుంచి 63వ స్థానానికి చేరామన్నారు. వంద దేశాలకు కరోనా టీకా డోసులు అందించామని, 48 దేశాలకు ఉచితంగా కరోనా టీకా డోసులు అందజేశామని తెలిపారు. ఖాదీ వారసులమని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటోందని, అయితే, బీజేపీ హయాంలోనే రూ.1.15 లక్షల కోట్ల ఖాదీ అమ్మకాలు జరిగాయాన్నారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని నడ్డా వివరించారు.

English summary
BJP will come to power in andhra pradesh: JP Nadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X