బిజెపిని దోషిగా నిలబెట్టి ఎన్నికలకు టిడిపి:కన్నా;అలా చేస్తే టిడిపికి మా మద్దతు:రోజా
కర్నూలు:ఎంపి సిఎం రమేష్ దీక్షపై బిజెపి, వైసిపి నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో చంద్రబాబు కావాలనే దీక్ష చేయిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ కోసం టిడిపి నేతలు చేస్తోందని దీక్ష కాదని, డైటింగ్ అని వైసిపి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టిడిపిపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం రమేష్, బిటెక్ రవిల దీక్షల వెనక మర్మంను ప్రజలు అర్థం చేసుకున్నారని, నాలుగేళ్లు నోరెత్తకుండా ఇప్పుడు దీక్షలు చేస్తే ఏమీ రాదన్నారు.

Recommended Video

చిత్తశుద్ధి లేని ఇలాంటి దీక్షలు ఎందుకని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఇలాంటి దీక్షలు చేస్తే సంవత్సరమైనా షుగర్ లెవల్స్ తగ్గవన్నారు. అయితే టిడిపి ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలో పోరాడితే తాము మద్దతిస్తామని రోజా చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications