పెళ్లిలో.. అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటే వీడియోలు తీసి..
రాజమండ్రి/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండపేట ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. వివాహ వేడుకలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను తీసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
మండపేటలో ఇటీవల ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో మహిళల గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో నిందితులు వీడియోలు తీశారు.
వీటిని చూపించి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయిల కుటుంబ సభ్యుల నుంచి రూ. లక్షలు వసూలు చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.

తిరుమల నడకదారిలో ఎలుగుబంటి
చిత్తూరు జిల్లా తిరుమల నడక దారిలో ఎలుగుబంటి కలకలం చెలరేగింది. ఆంజనేయస్వామి ఆలయం వద్ద రెండు ఎలుగు బంట్లు సెల్ టవర్ ఎక్కాయి. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications