బాణాసంచా కేంద్రంలో పేలుడు: నలుగురి మృతి, పలువురికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కొత్తపేట మండలం పలివెలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండుగ కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం.
2014లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

విషం తాగి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరిలో జిల్లాల విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
కానిస్టేబుల్ చేతిలో ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. కానిస్టేబుల్ చేతిలో ఉన్న ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications