తలసాని షాక్: అప్రమత్తమైన బాబు, ఇంకా ఎవరు..?

ఈ భేటీలో తెలంగాణ టీడీపీ కమిటీ చైర్మన్ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మాగంటి బాబు, రేవంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ తదితరులు కలవనున్నారు. తాజా పరిణామాల పైన చంద్రబాబు వారితో చర్చించారు. సాయంత్రం మరోసారి తెలంగాణ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.
తెలంగాణలో పలువురు ముఖ్యనేతలు తెరాసలోకి వెళ్తున్నందున.. ఇంకా ఎవరైనా పార్టీని వీడుతారా అని చంద్రబాబు వారి నుండి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. తలసాని, తీగల వంటి నేతలు పార్టీ వీడటం వరకు అభ్యంతరం లేదని, విద్యుత్ విషయంలో తనను తప్పుపట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణనిస్తున్ారని తెలుస్తోంది.
కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్న విషయం తెలిసిందే. తలసాని తాము తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శుక్రవారం తెలంగాణ టీడీపీ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్రకు ముందే పార్టీలో సంక్షోభం ఏర్పడటం గమనార్హం.












Click it and Unblock the Notifications