విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10మంది యువతుల బ్లూఫిల్మ్: నాయకుల కొడుకులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Blue Film gang arrested on Saturday.
విజయవాడ: విజయవాడ నగరంలోని కాలేజి విద్యార్థినీలను ట్రాప్ చేస్తున్న ముఠాలోని కొంతమంది సభ్యులను పోలీసులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ముఠాలో ఒకరిద్దరు రాజకీయ నాయకుల తనయులు కూడా ఉండవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రేమ పేరుతో కళాశాల విద్యార్థినులకు వలవంయడం.. సరదా, షికార్లు పేరిట తిప్పటం... ఏకాంత సమయాల్లో వారిని సెల్‌ఫోన్, కెమెరాల ద్వారా చిత్రీకరించి.. ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముఠాలో నిందితులు.. దీపక్, నిమ్మకూరి సాయిరామ్, షేక్ మున్నా ఖాదర్ జిలాన్, అభిలాష్ కుమార్‌లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.

వీరితో పాటు మరో 17 ఏళ్ల యువకుడు ఈ దురాగతంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ విద్యార్థి కాగా, మిగిలిన నలుగురూ స్థానికంగా వివిధ పనులు చేసుకుంటూ ఉంటారు. తొలుత ఈ ముఠా సభ్యులు కాలేజీ విద్యార్థినీలను గుర్తించి ప్రేమ పేరుతో ఆకర్షించేవారు. వారిని బైక్ల పైన తిప్పుతూ రెస్టారెంట్లు, సినిమాలకు తీసుకు వెళ్లడంతో పాటు వివిధ కానుకలతో ప్రలోభ పెట్టేవారు.

అనంతరం యువతులను దూరప్రాంతాలకు తీసుకు వెళ్లి ఏకాంత సమయాల్లో సెల్ ఫోన్లు, కెమెరాల్లో చిత్రీకరించసాగారు. సుమారు ఏడాదిన్నరగా ఈ వ్యవహారం సాగుతోంది. వారం క్రితం బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుట్టు రట్టు చేశారు. ప్రేమ పేరిట యువతులను వంచించి సుమారు పదిమంది యువతులను రహస్య కెమెరాలతో నీలిచిత్రాలు చిత్రీకరించారట. ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో రాజకీయ నాయకుల తనయులు కూడా ఉన్నారట.

English summary
A gang, trapping girls and making blue films, has been nabbed by police in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X