బ్లూ ఫిల్మ్స్ ముఠా: కృష్ణాలోకి యువకుడి తోసివేత

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగర్ వద్ద గురువారం ఉదయం ఓ యువకుడిని ఇద్దరు దుండగులు కృష్ణా నదిలోకి తోసివేశారు. ఇనుప చువ్వలపై యువకుడు పడిపోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది.
దీన్ని గుర్తించిన స్థానికులు దుండగుల పట్టుకునేందుకు వెంటపడటంతో కృష్ణానదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రం గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లాలోని చౌడవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌వీఆర్‌జేసీ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి అనిల్ మృతి చెందాడు. అనిల్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications