Actress: నా జీవితం నాశనం చెయ్యడానికి నాటి సీఎం ఆఫీసులో స్కెచ్ వేశారు

గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం కార్యాలయంలో నాపై తప్పుడు కేసులు పెట్టడానికి కుట్ర జరిగిందని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో చెప్పారు. కోర్టులో న్యాయాధికారి ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో సాక్షి అయిన గొరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని న్యాయాధికారి నమోదు చేసుకున్నారు.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 31వ తేదీన తనను పిలిపించారని, అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు కలిసి తనను చిత్రహింసలకు గురి చేశారని కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి చెప్పారు. జనవరి 31వ తేదీన అర్దరాత్రి వరకు తనను మగ పోలీసులే విచారణ చేశారని ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి చెప్పారు.

Bollywood actress Kadambari Jethwani testified in the court that she was arrested in a false case

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, పోలీసు అధికారులు కుమ్మక్కై తనను చిత్రహింసలకు గురి చేశారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి చెప్పారు. నన్ను పెళ్లి చేసుకోవాలని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తనను బెదిరించాడని, పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టం లేదని 2015 లోనే అతనికి తేల్చి చెప్పానని, ఆ విషయంపై తన మీద కక్ష పెంచుకున్న వైసీపీ నాయకుడు విద్యాసాగర్ పోలీసు అధికారులతో కుమ్మక్కు అయ్యి తన మీద తప్పుడు కేసు పెట్టారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి చెప్పారు.

ఇదే విషయంపై ఇబ్రహీంపట్నంలో తన మీద తప్పుడు కేసు పెట్టారని, కేసు నమోదు అయిన ఒక్క రోజు ముందుగానే ముంబాయికి విమానం టిక్కెట్లు బుక్ చేశారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కోర్టులో న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చారు. ముంబాయిలో తనతో పాటు తన తల్లిదండ్రుల అరెస్టు చేసి విజయవాడ పిలుచుకుని వచ్చారని, ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీసులే తనను విచారణ చేశారని, ఆ సమయంలో తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి చెప్పారు.

Bollywood actress Kadambari Jethwani testified in the court that she was arrested in a false case

పోలీసు అధికారులు హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తనను విచారించారని, ఆ తర్వాత సత్యనారాయణ, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్స్ పెక్టర్ శీను, శ్రీధర్ తదితరులు నాపట్ల దురుసుగా ప్రవర్తించారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారి ముందు చెప్పారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీలు కుమ్మక్కు అయ్యారని, తన మీద తప్పుడు కేసులు పెట్టి చిత్రం గురించి చేశారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారి వాంగ్మూలం ఇచ్చారు.

నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని తన బంధువని చూపించారని, మమ్మల్ని అరెస్టు చేశామని అతని సమాచారం ఇచ్చామని తప్పుడు పత్రాలు సృష్టించారని, తప్పుడు సాక్షాలతో తనను బెదిరించారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చారని వెలుగు చూసింది. తనను తప్పుడు కేసులో అరెస్టు చేసి తన పరువుకు భంగం కలిగించారని, సమాజంలో తనకు చెడ్డపేరు తీసుకు వచ్చారని, వైసీపీ నాయకుడు విద్యాసాగర్ తో పాటు పోలీసు అధికారులు మా కుటుంబం పరువు తీశారని బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+