కలకలం:పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబ్ స్క్వాడ్‌తో సహా పోలీసుల విస్తృత తనిఖీలు...కారణం ఇదే!
పశ్చిమగోదావరి:పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం...ఉన్నట్టుండి బిలబిలమంటూ దిగిన పోలీసులు...బాంబు స్క్వాడ్ బృందాలు...వచ్చీరావడంతోనే విస్తృతంగా తనిఖీలు మొదలు పెట్టాయి. ఎన్నడూలేని విధంగా...ఏమీ జరగకుండానే ఇలా సోదాలు చేపట్టడంతో స్థానికులు ఠారెత్తిపోయారు.
ఏం జరిగిందోనని భీతిల్లిపోయారు...అయితే పశ్చిమ గోదావరి జిల్లాను మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు...అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పోలీసు బృందాలు సోమవారం నుంచి ఇలా విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిసి ఊరటచెందారు.

పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఎస్‌ఐ మధు వెంకట రాజా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన రహదారుల వెంట, అలాగే కల్వర్టులు, బ్రిడ్జ్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఒకవైపు బాంబ్ స్క్వాడ్ లతో మరోవైపు పోలీసు జాగిలాలతో ప్రధాన కూడళ్ళల్లో తనిఖీ చేశారు. అయితే ఒక్కసారిగా పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.
తనిఖీల అనంతరం ఎస్‌ఐ మధు వెంకట రాజా మాట్లాడుతూ మావోయిస్టుల రాకపోకలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు,సోదాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ఇకపై ఈ ప్రాంతంలో ఈ తరహా ప్రక్రియలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications