చంద్రబాబు నోటీసుల వెనుక ఉన్నది ఆయనే: బోండా ఉమ ఆరోపణ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడంతో ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన ఘటన పైన అలాగే యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులపై టిడిపి నేత బోండా ఉమ మండిపడ్డారు.
జగన్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులు ఇప్పించారని, అంతమాత్రం చేత చంద్రబాబు అవినీతిపరుడు కాదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఉమామహేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి సామ్రాట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు తనకు వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారని పేర్కొన్న బోండా ఉమా చంద్రబాబు ఇచ్చిన సమాధానాలకు ఐటి విభాగం సంతృప్తి చెందిందని చెప్పుకొచ్చారు.గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు పైన అవినీతి ఆరోపణలు చేశారని, కానీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించే దమ్ము వైసిపి నేతలకు లేదన్నారు.
అంతేకాదు యువగళం పాదయాత్ర పైన వైసిపి దాడులు పథకం ప్రకారం చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. యువగళం పాదయాత్రను ఆపాలని సీఎం జగన్ రెడ్డి పథకం ప్రకారం గొడవలు చేయిస్తున్నారని బోండా ఉమా మండిపడ్డారు.లోకేష్ పాదయాత్రకు తగిన రక్షణ కల్పించాలని డీజీపీకి అనేక లేఖలు రాసినా ఫలితం లేకుండా పోతుంది అన్నారు. పాదయాత్ర వద్దకు పోలీసులు వైసిపి గుండాలను ఎలా అనుమతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
లోకేష్ పాదయాత్రతో వైసిపి వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే ఈ విధంగా దాడులకు తెగబడ్డారు అని బోండా ఉమ మండిపడ్డారు. యువ గళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మళ్లీ వాలంటీర్ల పైననే అక్రమ కేసులు పెట్టారని బోండా ఉమ అసహనం వ్యక్తం చేశారు. యువ గళం పాదయాత్రను అక్రమంగా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తాము ఎంతవరకైనా వెళతామనీ స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ వేశారు.












Click it and Unblock the Notifications