అవాస్తవాలే.., ఆ బాధ్యత తీసుకోండి: పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ఉమ జవాబు
పోలవరం ప్రాజెక్టు డంపింగ్, అమరావతి భూముల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి అవాస్తవాలే వెళ్తున్నాయని, ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని టిడిపి కోరింది.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు డంపింగ్, అమరావతి భూముల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి అవాస్తవాలే వెళ్తున్నాయని, ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని టిడిపి కోరింది.
ఆదివారం నాడు టిడిపి విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. పవన్ ట్విట్టర్లో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గ్రీన్ ట్రైబ్యునల్ సహా అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అనుమతులు తీసుకుందన్నారు.

భవిష్యత్తు కోసం రైతులను ఒప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారం పవన్ పైనే వేయడం గమనార్హం. రైతులు కన్నీరు పెట్టవద్దన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు పవన్ నచ్చ చెప్పాలని కోరారు. ఆ బాధ్యత పవన్ పైన ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications