పవన్ కళ్యాణ్‌కు ఉమ కౌంటర్, బడ్జెట్‌పై రాయపాటి అసంతృప్తి, కానీ

ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైసిపి అధినేత జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు.

గుంటూరు: ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైసిపి అధినేత జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హోదా పైన ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

హోదాకు తగిన ప్యాకేజీ కేంద్రం ఇస్తోందని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు ఆశించిన మేర రావడం లేదని ఆయన చెప్పారు. ఈ విషయం ఆర్థిక సర్వేలో స్పష్టమైందని చెప్పారు. హోదా పైన మభ్యపెట్టవద్దన్నారు.

Bonda Uma appeals dont mislead people

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది, కానీ: రాయపాటి

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఎంపీ రాయపాటి సాంబశివ రావు గురువారం అన్నారు. రైల్వే జోన్ వాగ్దానం అమలు చేస్తే బాగుండేదని చెప్పారు. అయితే అమరావతి రైతులకు పన్ను మినహాయింపు మాత్రం మంచి నిర్ణయమని చెప్పారు.

రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. మాచర్ల, వినుకొండ ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు పెంచాలన్నారు. రైళ్ల పెంపు విషయమై రైల్వే మంత్రికి వినతిపత్రం ఇస్తామన్నారు. ఈసారి రైల్వే ప్రాజెక్టులను సాధిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+