నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుండా, రాజకీయ కుట్ర: బోండా ఉమ సవాల్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఒక్క గజం స్థలం ఆక్రమించుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన భూమితో పాటు పలుచోట్ల తాను భూకబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని బోండా ఉమ వెల్లడించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని బోండా ఉమ మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు తమ భూములు ఆక్రమించారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.












Click it and Unblock the Notifications