వైసీపీ ఆరునెలల పాలనపై పుస్తకం విడుదల చేసిన టీడీపీ...

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరునెలల పాలనను పూర్తి చేసుకున్న సంధర్భంలో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ప్రతిపక్ష టీడీపీ "మంచి సీఎం కాదు ముంచే సీఎం'' అంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని టీడిపీ నేత యనమల రామకృష్ణుడుతో పాటు జిల్లా నేతలు విజయవాడలో విడుదల చేశారు. ఈ సంధర్భంగా ప్రభుత్వ విధానాలను యనమల విమర్శించారు.

వైసీపీ ఆరు నెలల పాలనపై పుస్తకం

వైసీపీ ఆరు నెలల పాలనపై పుస్తకం

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ మొహన్ రెడ్డి బాద్యతలు చేపట్టి ఆరునెలలు గడుస్తోంది. గడిచిన ఆరునెలల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మరింత రాజకీయా వైరానికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలు, అమలుపై టీడీపీ విరుచుపడుతూ... వస్తుంది. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల కాలం పూర్తి చేసుకోవడంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఏకంగా ఓ పుస్తకాన్నే విడుదల చేసింది. దానికి మంచి సీఎం కాదు ముంచే సీఎం అంటూ క్యాప్షన్ పెట్టారు.

జగన్ హాయంలో ఉద్యోగులకు జీతాలు కూడ లేవు

జగన్ హాయంలో ఉద్యోగులకు జీతాలు కూడ లేవు

పుస్తకం విడుదల సంధర్భంగా యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విధానాలు, అభివృద్దిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడ ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని సీఎం జగన్‌పై ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో 83వేల కోట్లు పెట్టి...వాస్తవ రూపంలోకి వచ్చే సరికి కేవలం 21వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరుగుతూ...ఖర్చులు కూడా పెరిగాయని ఆయన వివరించారు. కాని వైసీపీ ప్రభుత్వ హాయంలో ఆదాయం తగ్గిందని ...దీంతో ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరగడం లేదని ఆయన విమర్శించారు.

పాలనంతా అవినీతిమయమే...

పాలనంతా అవినీతిమయమే...

మరోవైపు జగన్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఇసుక నుండి గనులు, మద్యం విధానాల్లో కూడ అవినీతి రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ పరిపాలన ఇలాగే కొనసాగితే.... రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ అంధకారమే అవుతుందని విమర్శించారు. మరోవైపు అవినీతీ కేసులను ఎదుర్కోంటున్న సీఎం అవినీతి అరికడతామని చెప్పడం అశ్చర్యాన్ని కల్గిస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+