ఉద్యోగులంతా భయపడిపోతున్నారు - బొప్పరాజు..!!

ఏపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు వరకు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 26 జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు.

పనులు చేస్తున్నారు
ఫ్రీ హోల్డ్ ప్రక్రియ తప్పుల తడక అని ఈ ప్రభుత్వం అభిప్రాయపడిందని బొప్పరాజు తెలిపారు. ఇందులో ఉద్యోగుల పై నిందలు మోపడం సరి కాదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా..‌వారి ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని బొప్పరాజు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో అనేక విభాగాల పనులను చేయిస్తున్నారన్నారు.

Bopparaju Venkateswarly serious comments over Records maintainance in the govt

భద్రత ఉందా
పురాతన శాఖ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు. ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా? అని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్‌ల‌ వద్దే ఉన్నాయన్నారు. అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఈ రికార్డుల భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలన్నారు. పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్ మెన్ కూడా లేరన్నారు.

భయపడిపోతున్నారు
ఉద్యోగులు చేసే పనికి, కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని.. నెలకు 54 రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. వీవీపీలు వస్తే లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుందని.. అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు. సిసి కెమెరాలు పెట్టాలని‌ ఆదేశాలు ఇచ్చారని.. నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో ఎవరు దోషులో‌ఇంకా తేలలేదని.. ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని.. ‌విచారణ పూర్తి అయ్యాక వాస్తవాలు చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+