పుట్టింది పాకిస్థాన్ లో.. 19 ఏళ్లుగా ధర్మవరంలో.. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి?

జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉగ్రదాడి ఘటనతో భారత్ వ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో ఉన్నారు. పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది.

ఈ మేరకు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ పౌరులను వెంటనే గుర్తించి వెనక్కు పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలోని పాకిస్థాన్ పౌరులను వెతికే క్రమంలో ఓ షాకింగ్ కథనం బయటకు వచ్చింది. ఓ మహిళ పాకిస్థాన్ లో పుట్టి భారత్ కు వచ్చి భారతీయుడ్ని వివాహం చేసుకుంది. అయితే.. అనుకోని రీతిలో ఆమె తన కుమార్తెకు జననాన్ని పాకిస్థాన్ లో ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి పెరిగింది మాత్రం భారత్ లోనే కావడం గమనార్హం.

పహల్గాం ఉగ్రదాడి ఘటన ఆ 26 ఏళ్ల యువతి జీవితంలోకి సమస్యను తీసుకొచ్చింది. ఆమె పుట్టింది పాకిస్థాన్ లోనే అయినా.. పెరిగింది మాత్రం భారత్ లోనే.. గడిచిన 19 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం ధర్మవరంలోనే ఆ అమ్మాయి పెరిగింది. తాజా పరిస్థితుల్లో పాకిస్థాన్ కు తిరిగి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడని ఆమె భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నగా మారింది.

ఏమైందంటే?

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన 26 ఏళ్ల రంశా రఫిక్.. పహల్గాం ఉగ్రదాడి కారణంగా ఆమె జీవితంలోకి కొత్త కష్టం వచ్చిపడింది. తాజా పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఆమె పాకిస్థాన్ కు వెళ్లేందుకు ఇష్టం లేదు. కానీ ఆమె వెళ్లకుండా ఉండేందుకు వీల్లేని పరిస్థితి.

Born in Pakistan Living in Dharmavaram The Story of a 19-Year-Old Girl

కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ అనే వ్యక్తి 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్ ను ధర్మవరంలోని తన చెల్లెలు కొడుకు రఫిక్ అహ్మద్ కు ఇచ్చి 1989లో పెళ్లి చేశారు. ఈ జంటకు మొదట కొడుకు పుట్టాడు.

1998లో రెండోసారి జీనత్ ప్రెగ్నెంట్ అయింది. అయితే తన తండ్రి ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆయన్ను చూసేందుకు పాకిస్థాన్ వెళ్లింది. అదే సమయంలో కార్గిల్ యుద్ధం ప్రారంభం కావడంతో ఆమె అక్కడే ప్రసవించింది. ఆమెకు రంశా రఫిక్ అనే ఆడపిల్ల పుట్టింది. 2005లో ఆమెను తీసుకొని ధర్మవరం వచ్చేశారు తల్లిదండ్రులు. పాక్ లో పుట్టడం కారణంగా ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం వచ్చింది.

ఆ తర్వాత ధర్మవరం వచ్చినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నం చేయలేదు. 2018లో పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. అది 2028 వరకు వ్యాలీడ్ ఉంది. అయితే 2023లో భారత పౌరసత్వం కోసం రంఫా దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. దీంతో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న ఆమె భారత్‌లోనే ఉంటుందా? లేక అధికారులు ఆమెను పాకిస్థాన్ పంపుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+