వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో గందరగోళం: మోడీ! తెలుగువాడి దెబ్బ చూస్తారా.. ఎన్టీఆర్‌గా ఎంపీ, గోవిందా... జేసీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget Sessions : అన్ని పార్టీలూ ఒక్కటై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రెండో రోజైన మంగళవారం కూడా నిరసనలు తెలిపారు. మరోవైపు విపక్షాలు బ్యాంకు స్కాంపై ఆందోళన తెలిపింది. దీంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోకసభ, రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. తిరిగి లోకసభ 12 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీలు వివిధ అంశాలపై నిరసన తెలుపుతూ ప్లకార్డులతో వెల్లోకి చొచ్చుకెళ్లారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

చదవండి: ట్విస్ట్.. కర్నూలు రెండో రాజధానిగా ఓకే, కానీ: బీజేపీకి లోకేష్ దిమ్మతిరిగే షాక్

పార్లమెంటు గేటు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. టీడీపీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవ సభ నిర్వహించింది. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కృష్ణుడి వేషంలో వచ్చిన ఎంపీ శివప్రసాద్.. నేడు ఎన్టీఆర్ వేషధారణలో వచ్చారు.

లెక్క తీస్తాం, ఎవరి వల్ల ఆగాయో ఆధారాలు చూపిస్తాం: బాబుకు బీజేపీ షాక్, 'షా భయపడి ఫోన్ చేశారా'లెక్క తీస్తాం, ఎవరి వల్ల ఆగాయో ఆధారాలు చూపిస్తాం: బాబుకు బీజేపీ షాక్, 'షా భయపడి ఫోన్ చేశారా'

గోవిందా.. గోవిందా అంటూ జేసీ

గోవిందా.. గోవిందా అంటూ జేసీ

గోవిందా.. గోవిందా అని తాము ప్రారంభించామని, మోడీ ప్రభుత్వం కిందకు దిగి వచ్చి తమ కోరికలను నెరవేరిస్తే తప్ప తమ ఆందోళన కొనసాగుతుందని జేసీ చెప్పారు. బహుశా పార్లమెంటు చరిత్రలో గాంధీ విగ్రహం వద్ద ఇన్ని పార్టీలు ఒక్కటై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నదంటే ఇది అపూరవ సంఘటన అన్నారు.

మోడీ ఫెయిలయ్యారు

మోడీ ఫెయిలయ్యారు

నరేంద్ర మోడీ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు విఫలమైందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ, అకాలీదల్, తమిళనాడు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. బీజేపీకి దేవుడు అంటే నమ్మకం అని, దేవుడ్ని నమ్మే ఆ పార్టీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.

మళ్లీ గెలుస్తారనే నమ్మకం లేదు

మళ్లీ గెలుస్తారనే నమ్మకం లేదు

మోడీ ప్రభుత్వం మళ్లీ వస్తుందనే నమ్మకం అందరికీ పోయిందని జేసీ అన్నారు. మోడీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి బ్యాంకులలో డబ్బులు రావడం లేదని, దాచుకున్న డిపాజిట్లు వెనక్కి పోతున్నాయని, ప్రజల్లో నరనరాన వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. మోడీ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఆశీర్వదిస్తారని, లేదంటే లేదన్నారు. లేదంటే గోవిందా.. గోవిందా అన్నట్లుగా మిగిలిపోతుందన్నారు.

పెద్ద మనిషి కళ్లు తెరవాలి

పెద్ద మనిషి కళ్లు తెరవాలి

ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ.. ఇలాంటి పరిణామాలు తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఓ పార్టీ, ఓ ప్రాంతం అని లేకుండా అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి దాకా నెరవేర్చలేదన్నారు. కేంద్రం, ఈ పెద్ద మనిషి మోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి హోదా ఇవ్వాలన్నారు. కేసీఆర్ కూడా హోదాకు మద్దతు పలికారన్నారు.

తెలుగువాడి దెబ్బ మీరూ రుచి చూస్తారా

తెలుగువాడి దెబ్బ మీరూ రుచి చూస్తారా

ఎన్టీఆర్ వేషధారణలో వచ్చిన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసే స్థితికి తీసుకు వచ్చారా మోడీగారూ అన్నారు. ఇది అహంభావం, అక్రమం, అన్యాయం అన్నారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హోదా, కనకదుర్గమ్మ సాక్షిగా అద్భుత రాజధాని ఏమయిందన్నారు. ఒకప్పుడు తనను (ఎన్టీఆర్ వేషధారణలో ఎన్టీఆర్‌లా మాట్లాడారు) ఇందిరాగాంధీ పదవీచ్యుతిడిని చేసినప్పుడు తెలుగు ప్రజలు ఆగ్రహించారని, ఈ విషయం మోడీకి తెలియదా అన్నారు. తిరిగి నన్ను కుర్చీ మీద కూర్చోపెట్టే వరకు వారు నిద్రపోలేదన్నారు. తెలుగువాడి దెబ్బ మీరూ రుచి చూస్తారా మోడీగారు అని వ్యాఖ్యానించారు.

తెలుగువాడి దెబ్బ చూస్తారా

తెలుగువాడి దెబ్బ చూస్తారా

తెలుగువాడి దెబ్బ రుచి చూడాలనుకుంటే నేను ఏమీ చేయలేనన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే తెలుగువాడి దెబ్బ మీకు పడుతుందని హెచ్చరించారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ..

మురళీ మోహన్ మాట్లాడుతూ..

ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ.. తమ నిరసన ఫలితం ఉంటుందని, ఫలితం వచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కావొచ్చు లేదా ప్యాకేజీ కావొచ్చు.. ఏ పేరుతో పిలిచినా ఏపీకి మేం ఇచ్చిన 19 అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. జీవోలు అమలు చేయాలన్నారు. మాటలతో చెబితే ఊరుకునేది లేదన్నారు. మరో ఏడాది మాత్రమే మోడీ అధికారంలో ఉంటారు కాబట్టి నూటికి నూరు పాళ్లు అమలు చేయాల్సిందే అన్నారు. పదవుల త్యాగానికి కూడా సిద్ధమన్నారు. మాకు ఏపీ అభివృద్ధి కావాలన్నారు.

English summary
Both Houses adjourned over ruckus on PNB scam. TDP protests outside Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X