కేసు నుంచి ఎలా బయటపడాలన్నదే..: బాబుపై బొత్స ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కూడా కేసుల నుంచి ఎలా బయటపడాలనే విషయంపైనే చర్చలు జరిపారని, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సొంత విషయాలపై చంద్రబాబు దృష్టి పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల గురించి, రైతు కూలీల గురించి ఆలోచించకుండా ఓటుకు నోటు గురించే ప్రతిక్షణం ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో పార్టీని రక్షించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఏ కార్యక్రమం జరిగినా రాజ్యాంగం ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.

చంద్రబాబు స్వార్థంతో స్వలాభానికి పాల్పడుతున్నారని, రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహిరిస్తే చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. కానీ ఎందుకు చంద్రబాబు ఆ పనిచేయడం లేదని బొత్స ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రైతుల వ్యవసాయ విధానాలు చంద్రబాబుకు తెలుసా అని అడిగారు. ఎపిలో రైతులకు రుణాలు ఇచ్చే విషయాన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ వ్యాపారాల కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసు చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
వ్యక్తిగత స్వార్థం కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతుల సమస్యలపై చర్చించి అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ఆయన ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశఆరు. లేదంటే రైతుల పక్షాన నిలిచి తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications