బొత్సా కు టీడీపీ లైన్ క్లియర్..!?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్దిగా బొత్సా నామినేషన్ దాఖలు చేసారు. కూటమి నుంచి పలువురు పేర్లు తెర మీదకు వచ్చినా అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. రేపు (మంగళవారం) నామినేషన్లకు చివరిరోజు. ఇప్పటి వరకు పోటీ చేయాలా వద్దా అనే అంశం పైన కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి పోటీ పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారికంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బొత్సా నామినేషన్
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలుచేసిన బొత్సా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపితే దుశ్చర్యకు పాల్పడినట్లేనని అన్నారు. వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందని..టీడీపీకి ఉన్న బలం కేవలం 300 ఓట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా, టీడీపీ ఎందుకు పోటీలో ఉంటుందో తెలియడం లేదన్నారు. టీడీపీ బిజినెస్‌మెన్‌ను తీసుకొచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతుందని..రాజకీయాలు అంటే వ్యాపారమా అంటూ ప్రశ్నించారు.

కూటమి సైలెన్స్
కూటమి నుంచి ఈ రోజు అభ్యర్ది ఖరారవుతారని ప్రచారం జరిగింది., టీడీపీ నేతలు గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేసులో బైరా దిలీప్ చక్రవర్తి ముందున్నారని.. తరువాత అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఆశించి భంగపడిన చక్రవర్తి ఉన్నారని తెలుస్తుంది. అయితే, అధికారికంగా ఎవరి పేరు ప్రకటించారు. మంగళవారం మధ్నాహ్నంతో నామినేషన్ల గడువు ముగియనుంది. విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
రేపే చివరి రోజు
అటు వైసీపీ బెంగళూరు కేంద్రంగా క్యాంపు ఏర్పాటు చేసారు. జిల్లా నేతలతో జగన్ వరుస సమావేశాలు ఏర్పాటు చేసారు. ఓటర్లను కాపాడుకుంటే గెలుపు తమదేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 839 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి దాదాపుగా 600 ఓట్ల వరకు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 200 పైగా ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. బొత్సా పూర్తిగా ఓటర్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు. దీంతో..చివరి నిమిషంలో కూటమి నుంచి అనూహ్య నిర్ణయాలు వెలువడితే మినహా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పైన క్రమేణా స్పష్టత వస్తోంది.












Click it and Unblock the Notifications