మాటల గారడీయే, సెక్షన్ 8పై చిత్తుశుద్ధి లేదు: బాబు బొత్స
హైదరాబాద్: సెక్షన్-8పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా సెక్షన్-8 అంశాన్ని రాష్ట్రపతి వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు హడావిడి చేస్తున్నారు తప్పితే చేతలు లేవని బొత్స ధ్వజమెత్తారు. విభజన చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలులో ఉందని ఆయన చెప్పారు. సెక్షన్ 8 అమలు బాధ్యత గవర్నర్‌దేనని ఆయన అన్నారు.

సెక్షన్ 8 అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చందర్బాబు చర్చించారా అని ఆయన అడిగారు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడినట్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో ఉన్నందున ఆయనతో చంద్రబాబు చర్చలు జరపాలని బొత్స సూచించారు.
మాటల గారడీతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications