బిజెపికి పాత్ర లేదా: పురంధేశ్వరిపై బొత్స, కిరణ్‌పైనా..
హైదరాబాద్: కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనా, బిజెపిలో చేరాలని భావిస్తున్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పైనా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిప్పులు కురిపించారు. రాష్ట్ర విభజన విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేశారో తెలపాలని ఆయన అడిగారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటున్న కిరణ్ కుమార్ రెడ్ిడ చివరిని మిషం దాకా ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగారని, ముందే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
విభజనను వ్యతిరేకిస్తూ ఆరు నెలల క్రితమే తాను సామూహిక రాజీనామాలు చేద్దామంటే ముఖ్యమంత్రి పదవి కోసమే తాను అలా ప్రతిపాదించానని ప్రచారం చేశారని తప్పు పట్డారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు. గతంలో పెద్ద కంపెనీలను చిన్న కంపెనీలు టేకోవర్ చేసేవని, ఇప్పుడు ఆ విధానం రాజకీయాల్లో కూడా ప్రవేశించిందని వ్యాఖ్యానించారు. ఈ పోకడ భవిష్యత్తు తరాలకు ప్రమాదమని హెచ్చరించారు.

అవకాశవాదంతో పార్టీలు మారుతున్నారని, పార్టీలు పెడుతున్నారని విమర్శించారు. విభజన తమకూ బాధాకరమే అయినా, సీమాంధ్రకు న్యాయం చేసే ఉద్దేశంతో ప్యాకేజీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. సీమాంధ్రకు న్యాయం చేసేందుకు కిరణ్ ఏం చేశారో తెలపాలన్నారు.
విభజన విషయంలో బిజెపికి ఎలాంటి భాగస్వామ్యం లేదా? అని ప్రశ్నించిన ఆయన కొందరు విభజనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీలోకి ఎందుకు వెళుతున్నారో వివరించాలని పరోక్షంగా దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రశ్నించారు. ఓవైపు సమైక్యవాదాన్ని విన్పిస్తూనే బిజెపి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి ఎందుకు వెళుతున్నారో తనకు అర్థం కావడం లేదని బొత్స అన్నారు.
కిరణ్ పార్టీ పెడితే సంతోషమేనన్నారు. దాన్ని రాష్ట్రంలో కొత్త సంఘటనగా అభివర్ణించారు. కిరణ్‌పై గవర్నర్‌కు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఫిర్యాదు చేయడంపై స్పందిస్తూ.. ఆయన వద్ద ఏ ఆధారాలున్నాయోనని అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మేయర్ విషయంలో ఒప్పందం మేరకు వ్యవహరించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ను కోరామని బొత్స తెలిపారు.












Click it and Unblock the Notifications