అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగుల్ని వాడుకుంటూ వైసీపీ రాజకీయాలు ! బొత్స, సజ్జల ఏమన్నారో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

ఏపీ ఉద్యోగుల వ్యవహారాల్లో జగన్ ప్రభుత్వ సలహాదారుగా గతంలో నియమించిన నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయంలో ఆయనకు ఆఫీసు కేటాయించిన సందర్భంగా ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొన్న విద్యామంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఉద్యోగులపై బొత్స కామెంట్స్

ఉద్యోగులపై బొత్స కామెంట్స్

ఏపీ విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఉద్యోగులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయన్నారు. మనకు కోరికలు అపరిమితమైనవని, తీరే కోరికలు ఉంటే మంచిదన్నారు. ప్రభుత్వాలు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాయని, కానీ రాష్ట్రంలో ఉన్న కోట్లమంది సమస్యలు కూడా ముఖ్యమన్నారు. తద్వారా ఉద్యోగులు తీరే సమస్యలపైనే ప్రభుత్వానికి డిమాండ్లు చేయాలని బొత్స సలహా ఇచ్చారు.

 ఉద్యోగులు కోర్టుకెక్కితే ...

ఉద్యోగులు కోర్టుకెక్కితే ...

వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి బొత్స తెలిపారు. కానీ పిఆర్సీ వల్ల నష్టం వచ్చిందని చెప్పడం తప్పన్నారు. అందరూ మాట్లాడుకునే కదా పిఆర్సీ పై నిర్ణయం తీసుకున్నామంటూ ఉద్యోగ సంఘాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ఇప్పుడు 12వ పీఆర్సీ వేయమని కోరడం తప్పు కాదన్నారు. 80వేల కోట్లు ఏడాదికి జీతాలు రూపంలో ఖర్చుపెట్టాల్సి వస్తోందన్నారు. రేట్లకు తగ్గట్టు జీతాలు పెరగలేదని, కానీ తప్పదని బొత్స వ్యాఖ్యానించారు. ఉద్యోగులు కొన్ని సమస్యల విషయంలో కోర్టులకు వెళుతున్నారని, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, కోర్ట్ నిర్ణయం ప్రకారం వెళ్లిపోతామన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఉద్యోగులు కూడా సహకరించండి...అంటే ఎన్నికల ప్రచారం చేయమని కాదని బొత్స క్లారిటీ ఇచ్చారు

 ఉద్యోగులకు రాజకీయాలు వద్దన్న జగన్

ఉద్యోగులకు రాజకీయాలు వద్దన్న జగన్

ఉద్యోగులకు సమస్యలు ఉంటే ఇప్పటివరకు ఉద్యోగ సంఘ నాయకులే ప్రయత్నాలు చేసారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకోవాలనే ధోరణే కనపడిందన్నారు. తమకు ప్రత్యేకించి ఉద్యోగులను సంఘంగా చేసి ఆర్గనైజ్ చెయ్యాలనే ఆలోచన లేదన్నారు.


సీఎం దృష్టిలో ఉద్యోగులు అందరు సమానమేనన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ స్పష్టం గా చెప్పారన్నారు. పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని సీఎం చెప్పారని సజ్జల వెల్లడించారు.

 ఉద్యోగులతో రాజకీయాలపై సజ్జల

ఉద్యోగులతో రాజకీయాలపై సజ్జల

తమకు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు కూడా పరిచయం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఉద్యోగులను తమ రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. సమాజం మొత్తాన్ని మరింత మెరుగ్గా తీసుకువెళ్లడమే సీఎం ఉద్దేశమన్నారు. సమాజ అభివృద్ధి చెయ్యడంలో భాగంగానే ఉద్యోగులు ఉండాలన్నారు. తాము చేయలేకపోతే నిస్సహాయత బయటకు చెప్తున్నామన్నారు. తమకు ఉద్యోగుల గ్రూపులు అనవసరమని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సజ్జల సూచించారు. సమాజానికి సేవ చేస్తున్నామనే తృప్తి కూడా ఉద్యోగుల్లో ఉండాలన్నారు. ఉద్యోగులు అందరూ కలిసి అభివృద్ధిలో కీలకంగా ఉండాలనేదే సీఎం అభిప్రాయమన్నారు.

English summary
ap minister botsa satyanrayana and advisor sajjala ramakrishna reddy on today advised employees to co-operate the ysrcp govt on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X