• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం; సంక్షేమం అడ్డుకునేందుకే టీడీపీ కేసులు : మంత్రి బొత్సా

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం రెండడుగులు ముందుకు వేసి ఉంటే నాలుగడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు

రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు

220 చదరపు అడుగుల స్థలం ఇవ్వాలని నిబంధన ఉంటే, 270 చదరపు అడుగుల స్థలం కేటాయించామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ అవసరాలకనుగుణంగా ఆస్తులను విక్రయించడం అనేది సాధారణంగా జరుగుతుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

టీడీపీ సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తోంది

టీడీపీ సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తోంది

కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా అని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ప్రతి దానికి రాద్ధాంతం చెయ్యడం అలవాటు అయిపోయింది అని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసింది చంద్రబాబేనని పేర్కొన్న బొత్స సత్యనారాయణ అధికారం కోల్పోయిన టీడీపీ,అప్పటినుండి సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తోందని మండిపడ్డారు. గతంలో అధిక టారిఫ్ లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి అని బొత్స సత్యనారాయణ, చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టిందని పేర్కొన్నారు. ఆ బకాయిలు అన్నింటినీ వైసిపి ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇళ్ళ పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఇళ్ళ పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు


నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళ పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇవ్వడంతో బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు కేటాయించిన స్థలాలలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా సెంటు గ్రామాల్లో, సెంటున్నర స్థలం పట్టణాల్లో కేటాయింపును తప్పుపట్టింది. గృహ నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్లు వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

మహిళలకే కాదు అర్హులు అందరికీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

మహిళలకే కాదు అర్హులు అందరికీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన 3 జీవోలలోని నిబంధనలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే ఆరోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు, తాగు నీటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హైకోర్టు పేర్కొంది. వీటిని పరిశీలించకుండా గృహ నిర్మాణం చేయాలని బలవంతం చేయడం అన్యాయం అంటూ వ్యాఖ్యానించింది. కేవలం మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్జెండర్ లకు కూడా ఇళ్లు కేటాయించాలని, కేటాయింపుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ, గృహనిర్మాణ, పర్యావరణ శాఖ నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశించిన హైకోర్టు ఈ కమిటీ నివేదిక నెలరోజుల్లో ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఆ నివేదిక ఆధారంగానే గృహ నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

English summary
State Municipal Minister Botsa Satyanarayana commented that the High Court verdict on housing construction was painful.He accused the Telugu Desam party leaders of managing the systems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X