చంద్రబాబూ! అసలేం చేస్తావ్: బొత్స నిలదీత
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన గురువారం నాడు వైసిపి నేత బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేదని చెప్పినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం పైన ఇప్పుడు కాపర్ డ్యాంను తెరపైకి తెచ్చారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications