Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబూ! కేసీఆర్ పిలవగానే ఎగేసుకొని వెళ్లావ్‌గా, బాధ్యత వహించి: పవన్‌కు బొత్స వార్నింగ్

Recommended Video

    Botsa Satyanarayana Lashed Out At KCR And Chandrababu Naidu | Oneindia Telugu

    విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెరాసతో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించారు.

    కేసీఆర్‌ను తెలుగుదేశం నెత్తిన పెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును ఓటుకు కోటు కేసులో శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాసను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, దానికి ప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.

     కేసీఆర్ చెబితే మాకేం సంబంధం, కేసీఆర్ అంతే నష్టం చేశారు?

    కేసీఆర్ చెబితే మాకేం సంబంధం, కేసీఆర్ అంతే నష్టం చేశారు?

    కేసీఆర్ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏం సంబంధమని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలపై ప్రజలు ఆలోచించాలన్నారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు తెరాసతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఏపీని చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు.

     కేసీఆర్ పిలవగానే ఎగేసుకొని వెళ్లావ్

    కేసీఆర్ పిలవగానే ఎగేసుకొని వెళ్లావ్

    కేసీఆర్ యాగం చేసినప్పుడు పిలవగానే ఎగేసుకుంటు వెళ్లింది చంద్రబాబు కాదా అని బొత్స నిలదీశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించారని గుర్తు చేశారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహ సందర్బంలో అటు చంద్రబాబు ఇటు కేసీఆర్‌తో కూడిన కటౌట్లు వెలిశాయని గుర్తు చేశారు. తెరాసతో కలిసి ఉండి ఇప్పుడేమో తమ పార్టీకి అంటగట్టడం ఏమిటన్నారు. నిన్నటి వరకు బీజేపీ, జనసేనతో కలిసిపోయామని దుష్ప్రచారం చేశారని గుర్తు చేసారు. ఇప్పుడు తెరాసతో కలిశామని చెబుతున్నారన్నారు.

    చంద్రబాబు మాటలు వింటే నవ్వొస్తుంది

    చంద్రబాబు మాటలు వింటే నవ్వొస్తుంది

    చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మవద్దని బొత్స అన్నారు. కేసీఆర్‌ విజయవాడ వచ్చినప్పుడు ఆయన కోసం ఏపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారో చెప్పాలన్నారు. ఏపీ ప్రయోజనాల కంటే పార్టీ ​ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తాను చేసిన కృషే కారణమని చంద్రబాబు చెప్పిన మాటలు వింటే నవ్వొస్తుందన్నారు.

    లగడపాటిపై బొత్స నిప్పులు

    లగడపాటిపై బొత్స నిప్పులు

    లగడపాటి రాజగోపాల్ ఒక బ్యాంక్‌ కరప్ట్‌ అని, సర్వే పేరుతో తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను నట్టేట ముంచారని బొత్స అన్నారు. మనిషి బలహీనతతో ఆడుకోవడం లగడపాటికి అలవాటు అన్నారు. వైసీపీ ఉనికి లేకుండా చేయాలని కుట్రలు పన్నారన్నారు. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రానున్న ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

    అన్న ప్రతి దానికి బాధ్యత వహించాలి

    అన్న ప్రతి దానికి బాధ్యత వహించాలి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేనాని మానసిక పరిస్థితి బాగా లేదని ఎద్దేవా చేశారు. ఆయన తనపై అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనపై ఆయన ప్రతి మాటకు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదన్నారు. రాజకీయ పరిపక్వత లేనివాళ్లు పవన్‌లా మాట్లాడతారన్నారు. రాజకీయమంటే సినిమా డైలాగులు కాదని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+