భేటీకి రాష్ట్రం నుండి ముగ్గురు, టిని అడ్డుకుంటాం: బొత్స

న్యూఢిల్లీ: కేబినెట్ భేటీకి తెలంగాణ నోట్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనున్న భేటీకి రాష్ట్రం నుండి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి జైపాల్ రెడ్డి, సీమాంధ్ర నుండి కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు హాజరవుతారు. మరో మంత్రి కిషోర్ చంద్రదేవ్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కావడం లేదు.

టిని అడ్డుకుంటాం: బొత్స

తెలంగాణపై తీర్మానం అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు.

సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారన్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. తమలో రెండు వర్గాలు అనేది కేవలం మీడియా సృష్టేనని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని బొత్స ఈ సందర్భంగా తెలిపారు. కేబినెట్ నోట్ గురించి తనకు తెలియదన్నారు.

kavuri sambasiva rao, jaipal reddy and pallam raju

ప్రధాని నివాసంలో కేబినెట్ భేటీ

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఐదున్నర గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ నోట్ పెడతారనే వార్తల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతంలో కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది. భేటీపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా కేబినెట్ నోట్ పైన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం సంతకం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+