IPAC: ఐప్యాక్ తాత్కాలికం-వారికి టికెట్లివ్వలేదు-బొత్స షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో వైసీపీకి గత ఏడేళ్లుగా సేవలు అందిస్తున్న రాజకీయ వ్యూహాల కంపెనీ ఐప్యాక్ ఓసారి అధికారంలోకి కూడా తీసుకొచ్చింది. గతంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సంస్థకు నేతృత్వం వహించారు. అయితే తమిళనాడు, బెంగాల్లో అధికార పార్టీలకు సలహాలు ఇచ్చి గెలిపించిన తర్వాత ఆయన దీన్నుంచి తప్పుకున్నారు. తాజాగా ఏపీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ముఖ్యంగా వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని, జగన్ భారీగా నష్టపోతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనిపై స్పందిస్తూ జగన్ ప్రశాంత్ కిషోర్ గెలిపించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తున్నామంటూ చెప్పారు. దీంతో తర్వాతి ఇంటర్వూలో అందరూ ఇలాగే చెప్తారంటూ పీకే కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా అని బొత్స ప్రశ్నించారు. ఆయనో క్యాష్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. పీకే గిమ్మిక్కులు చేస్తారని చెప్పుకొచ్చారు. ఆయన్ని వన్ టైమ్ వ్యవహారం అని అనుకున్నామని, ఆ తర్వాత వదిలేశామని బొత్స వెల్లడించారు.
కోఆర్డినేషన్ కోసమే ఐప్యాక్ సేవలు తీసుకున్నామని, కన్సల్టెన్సీలు ఎన్ని చెప్పినా నిర్ణయాలు తీసుకోవాల్సింది తామేనన్నారు. పీకే వదిలేసినా తమకు పనిచేస్తున్న ఐప్యాక్ గురించి మాట్లాడుతూ ఆ సంస్థ ఇప్పటికీ నిర్మాణాత్మకంగా ఉందని తెలిపారు. అయినా ప్రశాంత్ కిషోర్ అయినా ఐప్యాక్ అయినా తాత్కాలికమే అని, వైసీపీ మాత్రమే శాశ్వతమని బొత్స తెలిపారు.












Click it and Unblock the Notifications