ఆ మాజీ మంత్రి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ..ఉత్తరాంధ్రలో లెక్కలు మారేనా..?
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషిస్తోంది. ఏ పార్టీ చూసినా.. సీనియర్లతో పాటు యువతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇక రానున్న పొలిటికల్ స్పెక్ట్రమ్ మొత్తం 80శాతం యువకులతోనే నిండుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి పలువురు సీనియర్ నాయకుల వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తామే బరిలో నిలుస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత.. ఆయన కుమార్తె ఎవరు..?
తండ్రి స్థానంలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వంపై ఉమ్మడి విజయనగరం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె, వృత్తిరీత్యా వైద్యురాలు అయిన డాక్టర్ బొత్స అనూష త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆమె రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఇక తండ్రిలానే తనయ కూడా ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు సమాచారం. తండ్రిలా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అనూష రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూ, ప్రజల్లోకి వెళ్తున్నారు. పల్లె పల్లెకు వెళ్లి మహిళలు, యువతతో సమావేశమవుతూ వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. ఒక వైద్యురాలిగా ప్రజలకు ఆమె ఇప్పటికే సుపరిచితం కావడం స్థానికంగా సానుకూల అంశంగా కనిపిస్తోంది.
జగన్ నుంచి ఆమోదమే తరువాయి..
బొత్స కుటుంబానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాంచి పట్టుంది. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో అయితే దశాబ్దాలుగా ఆ కుటుంబందే హవా.వైసీపీలో బొత్స సత్యనారాయణకున్న సీనియారిటీ, బలమైన అండదండల దృష్ట్యా, ఆయన వారసురాలిగా డాక్టర్ అనూష రాజకీయ ప్రవేశానికి పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని స్థానిక వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. అనూష తన తండ్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులను, కార్యకర్తలను కలుస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. బొత్సకు విజయనగరం రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చక్రం తిప్పారో అందరికీ తెలిసిందే. తండ్రి బాటలోనే తన సత్తా చాటాలని భావిస్తున్నారు డాక్టర్ అనూష.
ఈ వారసత్వ మార్పుతో చీపురుపల్లి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున డాక్టర్ అనూష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె రాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అంచనా వేస్తున్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications