విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో కొత్త ట్విస్ట్ - గెలుపు ఖాయమా..!!
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ తమకు ఉన్న సంఖ్యా బలంతో గెలుపు ఖాయమని ధీమాగా ఉంది. తాజాగా చంద్రబాబు పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నిక పైన సమీక్ష చేసారు. కానీ, పోటీ పైన తుది నిర్ణయం తీసుకోలేదు. పోటీకి దిగే అంశం పైన కూటమి నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో బొత్సా ఈ నెల12న తన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు.
ఎన్నికల వ్యూహాలు
వైసీపీ సంఖ్య పరంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పైన ఆశలు పెట్టుకుంది. దాదాపు మూడు వందలకు పైగా ఓట్లు వైసీపికి ఎక్కువగా ఉండటంతో...తాము గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమి నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీల బలాబలాల పైన చంద్రబాబు ఆరా తీసారు. రూరల్ పరిధిలోని ఓటర్ల పైన మరింత సమాచారం కోరారు. వైసీపీ ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేసిన అంశం పైన చర్చ జరిగింది. దీంతో, పోటీ..అభ్యర్ది అంశం పైన చంద్రబాబు నిర్ణయం పెండింగ్ లో పెట్టారు.

బొత్సా సమావేశం
ఇటు పార్టీ నేతలతోవైసీపీ అభ్యర్ది బొత్సా సమావేశం అయ్యారు.12వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు. ఈ క్రమంలో అందరి సహకారం కావాలని కోరుతున్నానన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని, కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన వైసీపీదే విజయమని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు సంఖ్యా బలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న అంతర్యాం అర్థం కావడం లేదన్నారు. ఎవ్వరు ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఏన్నికల్లొ చుసామని వ్యాఖ్యానించారు.
వైసీపీ ధీమా
ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన వైసీపీకి విజయం ఖాయమన్నారు. బోత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడి వారని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అటు జగన్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున ఇస్తామని నమ్మించి.. కేవలం అడ్వాన్సు ఇచ్చి వదిలేశారని చెప్పారు. ఇప్పుడు కూడా విశాఖ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు అడ్వాన్సులతోనే సరిపుచ్చుతారని హెచ్చరించారు. దీంతో, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications