డిసెంబర్ దాకా ఆపగల్గితే: టిపై బొత్స, పాట్నాకు స్పీకర్

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: డిసెంబర్ 12వ తేది వరకు తెలంగాణపై కేంద్రం ప్రకటనను ఆపగలిగితే ఆ తర్వాత సభలో బిల్లు రాకుండా ఆపగల్గుతామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో అన్నట్లుగా తెలుస్తోంది.

సమైక్యాంధ్ర కోసం అధిష్టానం నుండి ఎంతకు సానుకూల ప్రకటన రాకపోవడంతో పలువురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. వారిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా తనతో సమావేశమైన ఎంపీలతో బొత్స మాట్లాడుతూ.. తొందర పడవద్దని, అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని చెప్పారట.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వారి ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని, సభలలో తెలంగాణ బిల్లు అడ్డుకోవాలంటే పదవులలో ఉండాలని, అవసరమైతే అందరం కలిసి నిర్ణయానికి వద్దామని చెప్పారట.

పాట్నాకు స్పీకర్.. ఎంపీల అపాయింటుమెంట్ వాయిదా

మరోవైపు స్పీకర్ మీరా కుమార్ పాట్నా పర్యటనకు వెళ్లారు. దీంతో ఎంపీల అపాయింటుమెంట్ ఈ నెల 30వ తేదికి వాయిదా పడింది. స్పీకర్‌ను కలిసేందుకు ఎంపీలు కార్యాలయానికి వెళ్లారు. ఆమె అందుబాటులో లేరు. దీంతో కార్యాలయ వర్గాలు 30న కలవాలని సూచించారు.

తాము స్పీకర్‌ను కలిసే ప్రయత్నాలు చేశామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి అందజేశానన్నారు. ఆమె అపాయింటుమెంట్ కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+