తొలిరోజు అపశృతి: విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద బాలుడి మృతి
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో భాగంగా తొలిరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్కర స్నానమాచరించారు. అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లకు భక్తులను అనుమతించారు.

ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భక్తులు పెద్దఎత్తున ఘాట్లలో పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. స్నానానికి నీటిలో దిగిన అడపా కిరణ్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.
ఇంటికి అతి సమీపంలో పద్మావతి ఘాట్‌లో ఆడుకునేందుకు వెళ్లిన మృతిచెందినట్లుగా తెలుస్తోంది. ఆడుకుంటూ తమ కళ్ల ముందు ఉన్న చిన్నారి ఒక్కసారిగా ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఊబిలో కూరుకుపోయి నలుగురు స్కూల్ విద్యార్థుల మృతి
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుంటూరు శివారులోని ఓబులునాయుడు పాలెంలోని నీటికుంటలో పడి నలుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు అభిషేక్, రమేష్, గోపి, సాయితేజలుగా పోలీసులు గుర్తించారు.
చౌడవరంలోని బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎనిమిది మంది శుక్రవారం క్రికెట్ ఆడిన తరువాత అక్కడి నీటికుంటలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో అందులోకి దిగిన నలుగురు పిల్లలు నీటికుంట ఊబిలో కూరుకుపోయి చనిపోయారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications