మూకుమ్మడిగా కుక్కలు దాడి చేసి బాలుడ్ని పీక్కు తీన్నాయి
విశాఖపట్నం: గుంటూరులోని ఆస్పత్రిలో ఓ చిన్నారిని ఎలుకలు కొరికి చంపేసిన సంఘటనను మరిచిపోక ముందే శుక్రవారంనాడు విశాఖపట్నంలో అంతకు మించిన ఘోరం జరిగింది. వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ఓ రెండేళ్ల పసిగుడ్డును పీక్కు తినేశాయి.పిల్లాడి కడుపులో పేగులు కూడా బయటకు తీసి తిన్నాయి.
విశాఖపట్నం బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న హార్బర్ పార్క్‌లో పనిచేస్తున్న జె పోతయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్త కూలిపనికి వెళితే అతడి భార్య రమణమ్మ పార్క్ పనులు చూస్తుంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం పోతయ్య కూలి పనికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రమణమ్మ బట్టలు ఉతుక్కుంటోంది. ఆ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన వారు తీసిన గేటు వేయకుండా ఇంట్లోకి వెళ్లిపోయారు.

దీంతో రమణమ్మ రెండో కుమారుడు శివకేశవ (2) గేటు బయటకు వెళ్లి అడుకుంటుంటుండగా, అతడిపై నాలుగు కుక్కలు దాడి చేశాయి. బాలుడ్ని నోట కరచుకుని, పక్కనే ఉన్న తుప్పల్లోకి లాక్కుపోయి తీవ్రంగా గాయపరిచాయి. పిల్లాడి కడుపులోని పేగులు కూడా పీక్కుని తిన్నాయి. ఎంతసేపటికి పిల్లాడు తిరిగి రాకపోవడంతో రమణమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించింది.
పొదల్లో కుక్కలు గుంపుగా ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్లగా, కుక్కలు ఆమెపై కూడా దాడి చేశాయి. కుక్కలను రాళ్ళతో కొట్టి పొదల్లోకి వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడి, కొన ఊపిరితో ఉన్న బిడ్డ కనిపించాడు. వెంటనే బిడ్డను చేతులతో ఎత్తుకుని హుటాహుటిన కెజిహెచ్‌కు తీసుకువెళ్లింది. అయితే అప్పటికే శివకేశవ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శివకేశవ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శివకేశవ శరీరంపై 200కు పైగా గాయాలు ఉన్నట్టు కెజిహెచ్ సిఇఓ తెలిపారు. తెలిపారు.
శివకేశవ్ తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వారి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. కుమారుడి మృతితో ఆ కుంటుంబంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications