అవును! బోయపాటి షూటింగ్ వల్లే: రాజమండ్రి ఘటనపై బొత్స, సీఎం ఓఎస్‌డీని నటుడనుకొని...
హైదరాబాద్: రాజమండ్రి దుర్ఘటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు.
పుష్కరాల పైన ప్రముఖ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబు నాయుడు మీద డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే పుష్కరాల్లో దుర్ఘటన జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై బొత్స కూడా అలాగే మాట్లాడారు.
ఆ వ్యాఖ్యలను బొత్స సమర్థించారు. దుర్ఘటన పైన విచారణ జరిపి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవాన్ని కప్పి పుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు విఐపి పుష్కర ఘాట్‌కు కాకుండా సాధారణ భక్తులు చేసే ఘాట్‌లో ఎందుకు పవిత్ర స్నానం చేశారని బొత్స ప్రశ్నించారు.
పుష్కరాలకు పెట్టిన ఖర్చు పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఘటనకు బాధ్యత వహించి చంద్రబాబు రాజీనామా చేస్తారో లేదో చెప్పాలన్నారు. పుష్కర ఘాట్లో డాక్యుమెంటరీ షూటింగ్ చేసిన యూనిట్ పైన కేసు పెట్టాలన్నారు.

చంద్రబాబు ఓఎస్‌డీ పుష్కర స్నానం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని విఐపి ఘాట్‌లో శుక్రవారం నాడు చంద్రబాబు ఓఎస్‌డి పుష్కర స్నానం ఆచరించారు. ఆయన పుష్కరాలకు రావడం చూసి.. పలువురు భక్తులు అతనిని ప్రముఖ నటుడు షఫీగా భావించారు. నటుడు అనుకొని పలువురు పలకరించారు.
మీడియా ప్రతినిధులు కూడా వెళ్లి ఫోటోలు తీశారు. మీరు ఛత్రపతి సినిమాలో నటించిన షఫీ కదా అని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను నటుడిని కాదని, చంద్రబాబుకు ఓఎస్‌డీని అని చెప్పారు. తన పేరు వెంకయ్యచౌదరి అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications