ఆ మూడు సినిమాలను గ్రైండర్ లో వేసి బాగా రుబ్బిన బోయపాటి, రామ్!
రామ్ పోతినేని, శ్రీలీల నాయకా నాయికలుగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుస్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ట్రైలర్ చూసినవారిలో కొందరు మాత్రం ఇది చాలా రొటీన్ గా ఉందని, బోయపాటి గత సినిమాల ఛాయలను గుర్తు చేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అఖండ, సరైనోడు, జయ జానకి నాయక సినిమాల ఛాయలు ఈ ట్రైలర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయని, మిక్సీలో వేసి గట్టిగా రుబ్బినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్కందలో హీరోయిన్ రోల్ వినయ విధేయ రామ సినిమాలోని హీరోయిన్ కియారా అద్వానీ రోల్ ను గుర్తు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమా టేకింగ్ పరంగా కొత్తగా ఉండేలా బోయపాటి శ్రీను చూసుకోవాల్సి ఉంటుందని, సంగీత దర్శకుడిగా తమన్ అందించిన బీజీఎం మాత్రం హైలైట్ గా నిలిచిందంటున్నారు.

బోయపాటి శ్రీను సినిమాలంటే ప్రాణం పెట్టి చేస్తానంటూ తమన్ మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమాకు బోయపాటి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితర్వాత బాలకృష్ణతో తీయాల్సిన అఖండ2 సినిమాపై ఆయన దృష్టిపెడుతున్నారు. అఖండ2 లో యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం. దీనిపై ఇప్పటికే తెలుగు పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఒక బజ్ ఏర్పడింది. 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. రోజురోజుకు బాలయ్యను అభిమానించేవారి సంఖ్య పెరుగుతుండగా.. అందుకు తగ్గట్లుగా తన క్రేజీ ప్రాజెక్టులతో భారీ సక్సెస్ ను అందుకుంటూ ముందుకు దూసుకువెళుతున్నారు బాలకృష్ణ.












Click it and Unblock the Notifications