టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు: 24 మంది పాలక మండలి సభ్యులు వీరే

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు కానుంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాకటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డు అవకాశం కల్పించింది.

ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌​గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు నియమితులు కాగా, బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని టీటీడీ బోర్డు నియమించింది. వారిలో ఏపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నన్నపనేని సదాశివరావు, జాస్తి పూర్ణ సాంబశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్​ గౌడ్​, జంగా కృష్ణమూర్తి, శాంతారామ్​ నియమితులయ్యారు.

BR Naidu as Chairman of TTD 24 Governing Council members

తెలంగాణ నుంచి ఐదుగురుకి చోటు

తెలంగాణ రాష్ట్రం నుంచి నన్నూరి నర్సిరెడ్డి,సుచిత్ర ఎల్లా, బొంగునూరు మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయికి అవకాశం దక్కింది. కర్ణాటక నుంచి దర్శన్‌, నరేష్‌కుమార్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌లు బోర్డులో చోటుదక్కింది. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి శ్రీ సౌరభ్‌ హెచ్‌.బోరా, గుజరాత్‌ నుంచి డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌ బోర్డు సభ్యులుగా వ్యవహరించనున్నారు.

భక్తులకు టీటీడీ ఈవో దీపావళి శుభాకాంక్షలు

అక్టోబర్ 31వ తేదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో జే శ్యామలరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమని శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఈవో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+