వారసత్వ బంగారు కిరీటం వచ్చేసింది!

ఆధ్యాత్మిక నిలయం, కాలజ్ఞాన ప్రసాది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బ్రహ్మంగారి మఠం 12వ తరం పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి ప్రథమ కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వామి నియామకం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన ఆయన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పట్టాభిషేకానికి ముందుగా నిర్వహించే కీలక ప్రక్రియలో భాగంగా, నేడు మఠం నివేదన మందిరంలో దేవాదాయ శాఖ అధికారులు వారసత్వంగా వస్తున్న విలువైన వస్తువులను నూతన పీఠాధిపతికి అప్పగించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శంకర్ బాలాజీ, పంచాయతీ, పోలీస్ అధికారుల సమక్షంలో స్వర్ణ కిరీటం, స్వర్ణ రుద్రాక్ష మాల, స్వర్ణ కంకణాలు, వెండి వస్తువులను శ్రీ వెంకటాద్రి స్వామికి అందజేశారు.

Brahmamgari Matam Update Peethadhipathi Coronation Set for Feb 26 Endowments Dept Hands Over Gold Regalia

ఈ సందర్భంగా మఠం మేనేజర్ ఈశ్వర చారి మాట్లాడుతూ.. నూతన పీఠాధిపతికి ముందు తరం పీఠాధిపతులు వాడిన వస్తువులను అప్పగించడం ఒక పవిత్రమైన వారసత్వంగా వస్తోందని తెలిపారు. పట్టాభిషేకం రోజున నూతన మఠాధిపతి ఈ బంగారు ఆభరణాలను ధరించి మఠం బాధ్యతలు చేపడతారని ఆలయ అధికారులు వివరించారు.

నివేదన మందిరంపై స్పష్టత

పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి సంప్రదాయం ప్రకారం మహా నివేదన మందిరంలో నివాసం ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఆ మందిరాన్ని ఖాళీ చేసి అప్పగించాలని దేవాదాయ శాఖ అధికారులు సూచించారు.

కుటుంబపరమైన సమస్యలు లేకుండా, సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఎండోమెంట్ అధికారులు సూచించారు. దీనిపై స్పందించిన అధికారులు, కొంత సమయం ఇచ్చి మందిరాన్ని ఖాళీ చేయాలని కోరారు. త్వరలోనే శ్రీ వెంకటాద్రి స్వామి ఆ మందిరంలోకి ప్రవేశించి పీఠాధిపతిగా తన ధర్మ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+