‘పోకిరి’ సినిమా చూపిస్తూ మెలకువలో బ్రెయిన్ సర్జరీ సక్సెస్..!!

అభిమాన హీరో సినిమా చూపిస్తూ అరుదైన అపరేషన్ సక్సెస్ అయింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ కాసేపు సినిమా థియేటర్‌గా మారింది. రోగికి ఇష్టమైన 'పోకిరి' సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేయటం ఇప్పుడు అరుదైన ఘటనగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

పీ ప్రభుత్వ వైద్యరంగంలో మాత్రం తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్‌ (ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీ) చేసినట్లు గుంటూరు జీజీహెచ్‌ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన పండు(48) కాలు, చేయి బలహీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తీసుకొచ్చారు.

brain tumor surgery for patient while showing Pokiri movie in Guntur Govt Hospital

న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్‌ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు.

ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. జనవరి 25న రోగికి లోకల్‌ అనస్థీషియా ఇచ్చి ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీ చేశారు. పండు హీరో మహేశ్‌బాబు అభిమాని కావడంతో, ల్యాప్‌ట్యాప్‌లో 'పోకిరి' సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ ముగించారు.
ఆపరేషన్‌ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+