ఈ బ్రాండ్ల మద్యం, బీర్ల ధరలు తగ్గింపు - కొత్త రేట్లు ఇలా..!!

ఏపీలో మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్. మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా రూ 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 16 కంపెనీలతో మద్యం ధరల తగ్గింపు పైన ప్రభుత్వం చర్చలు చేసింది. ఇప్పటికే పది కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా.. తాజాగా మరో ఆరు కంపెనీలు ముందుకు రావటం తో వీటి ధరలు తగ్గాయి. కాగా, కొన్ని ప్రముఖ బీర్ల ధరలను తగ్గించారు. దీంతో, మందుబాబులు ఖుషీ అవుతున్నారు.

తగ్గుతున్న ధరలు
ఏపీలో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా రూ 99 కే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. కాగా, మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి.

Branded liquor and beers rates comes down in AP as Govt discussions with manufacturing companies

ముందుకొస్తున్న కంపెనీలు
ఏపీలో రూ 99 మద్యం కు భారీ డిమాండ్ ఉంది. దీంతో, మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటు కు మద్యం అందిస్తామని ముందుకు వచ్చాయి. అమ్మకాలు సైతం పెరగటంతో ధర తగ్గింపు తో మరింతగా సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించటంతో ఇతర కంపెనీల పైన ఒత్తిడి పెరిగింది. దీంతో, ఆ కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపుకు ముందుకు వస్తున్నాయి. దీంతో, మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాల పైన నిఘా పెరిగింది. దీంతో, ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునే విధంగా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి.

తాజా ధరలు
తాజా పరిణామాలతో మద్యం ధరలు తగ్గాయి. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పైనే రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాన్సన్‌ హౌస్‌ కంపెనీ క్వార్టర్‌ సీసాపై రూ.30 తగ్గించింది. అదే విధంగా అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. కానీ, మందు బాబులకు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+