13వ రోజు రైతుల మహా పాదయాత్రకు బ్రేక్; కళ్ళకు గంతలు కట్టుకుని ప్రకాశం జిల్లాలో నిరసన .. కారణాలివే!!
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఈరోజు 13వ రోజుకు చేరుకుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని నిర్ణయాన్ని ప్రకటించిన నాటి నుండి ఆందోళన బాట పట్టిన రాజధాని అమరావతి రైతులు ఇప్పటి వరకు అనేక విధాలుగా తమ నిరసనను తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ సీఎం జగన్ రాజధాని విషయంలో నిర్ణయాన్ని మార్చుకుని వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

రాజధాని అమరావతి కోసం రైతుల మహాపాదయాత్ర ఇలా
అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం, అలాగే ఉద్యమాన్ని వివిధ జిల్లాలకు విస్తరించడం కోసం నిర్ణయం తీసుకున్న అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కోర్టు ద్వారా అనుమతి పొంది, పాదయాత్రను ప్రారంభించారు రైతులు. అయితే అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు మహా పాదయాత్రలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాదు రైతుల సాగిస్తున్న మహాపాదయాత్ర పదకొండవ రోజున ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పోలీసులు లాఠీచార్జి చేయడంతో నాగార్జున అనే రైతు గాయపడ్డారు. ఆ తర్వాత అమరావతి రైతు మహా పాదయాత్ర పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

12 వ రోజు రాత్రికి యరజర్లకు చేరుకున్న పాదయాత్ర .. 13 వ రోజు పాదయాత్రకు బ్రేక్
ఇదిలా ఉంటే అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజున శుక్రవారం ప్రకాశం జిల్లాలో కొనసాగింది. పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం 13 వ రోజున యరజర్ల గ్రామం నుంచి ప్రారంభమై నిడమాలూరు వరకు సాగి రాత్రికి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అమరావతి రైతులకు నిడమాలూరు గ్రామంలో బస చేయడం ఇబ్బందిగా మారింది. నిడమాలూరు పంచాయతీలోని ఒక వార్డులో ఆదివారము ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బయటి నుండి వచ్చిన కొత్త వ్యక్తులు ఆ గ్రామంలో బస చేయడానికి వీల్లేదు.

ఆదివారం కొనసాగనున్న పాదయాత్ర
దీంతో శనివారం రైతుల మహా పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం నాడు యధావిధిగా పాదయాత్రను కొనసాగిస్తామని అమరావతి జేఏసీ పేర్కొంది. ఇప్పటివరకు అమరావతి రైతు మహా పాదయాత్ర 152.59 కిలోమీటర్ల మేర కొనసాగింది.ఇక ఈ రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన అమరావతి రైతులు రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అమరావతి ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడంలేదని నిరసన తెలియజేశారు.

కళ్ళకు గంతలు కట్టుకుని అమరావతి రైతుల వినూత్న నిరసన
వినూత్నంగా నిరసన తెలియ చేసిన అమరావతి రైతులు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్ల గ్రామంలో కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మహా పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూసి ప్రభుత్వ నోచుకోలేక పోతుందని మండిపడ్డారు. ప్రజల మద్దతును, ప్రజల కోరికను వైసీపీ ప్రభుత్వం కళ్ళుండీ చూడలేక పోతుందని, అందుకే తాము కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నామని రాజధాని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ మహా పాదయాత్ర ను కొనసాగించి తీరుతామని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications